Webdunia - Bharat's app for daily news and videos

Install App

చుక్కనీటినీ వదులుకోం.. రెచ్చగొడితే రెచ్చిపోం : సజ్జల

Webdunia
సోమవారం, 5 జులై 2021 (06:38 IST)
శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతలలోకి వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు వదులుతున్న తెలంగాణా ప్రభుత్వం తీరుపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. రాష్ట్రానికి కేటాయించిన కృష్ణా జలాలలో ఒక్క చుక్క నీటిని వదులుకోబోమని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం చేయాలో అది చేస్తామని అన్నారు.

ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా మధ్యవర్తిత్వం వహిస్తోందన్నారు. ఇప్పటికే కేంద్రానికి లేఖలు రాశామని, ఈ విషయంపై ఎక్కడ మాట్లాడాలో అక్కడ తప్పకుండా మాట్లాడతామని అన్నారు. వారు రెచ్చగొడితే రెచ్చిపోమని తెలిపారు.

ఆదివారంనాడు కూడా శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులనుండి 16వేల క్యూసెక్కులు, పులిచింతలలో ఏడువేల క్యూసెక్కులకు పైగా విద్యుత్‌ ఉత్పత్తి అనంతరం దిగువకు వదిలారు. హైదరాబాద్‌లో తన ఆస్తులు వున్నందుకే సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నోరుమెదపడం లేదని తెలుగుదేశం విమర్శించింది.

ట్రిబ్యునల్‌ తీర్పుల ప్రకారం రాష్ట్ర నీటివాటాను రాబట్టేందుకు కెసిఆర్‌ సవాల్‌కు సిఎం జగన్‌మోహన్‌రెడ్డి స్పందించాలని తెలుగుదేశం నేత మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments