Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రామానాయుడు స్టూడియోపై జగన్, విజయసాయిరెడ్డి కన్ను: బండారు సత్యనారాయణ

Advertiesment
రామానాయుడు స్టూడియోపై జగన్, విజయసాయిరెడ్డి కన్ను: బండారు సత్యనారాయణ
, శనివారం, 3 జులై 2021 (17:19 IST)
విశాఖను అభివృద్ధి చేసేందుకు గత తెలుగుదేశం ప్రభుత్వం అనేక విధాలుగా కృషిచేసింది. సినీరంగంలో ఎక్కువ మందికి ఉపాధి దొరుకుతోంది. ఈ నేపథ్యంలో విశాఖలో కూడా సినీరంగం అభివృద్ధికి చంద్రబాబునాయుడు గారు 2002లో రామానాయుడు గారిని ఒప్పించి బీచ్ లో సుమారు 34.44 ఎకరాలను స్టూడియో నిర్మాణం కోసం ఇచ్చారు.

అనంతరం వైఎస్ కూడా ప్రోత్సహించడంతో 2008లో స్టూడియోను పూర్తిచేశారు. ఇవాళ విశాఖలో అనేకమంది కళాకారులకు ఉపాధి దొరుకుతోంది. జగన్ రెడ్డి వచ్చిన తర్వాత విశాఖపై కన్ను వేసి నాశనం చేస్తున్నారు. రామానాయుడు స్టూడియోపై కన్నేసి వారి కుటుంబాన్ని బెదిరిస్తున్నారు. బ్రోకర్ గా విజయసాయిరెడ్డి వ్యవహరిస్తున్నారు. కార్తీకవనం భూములను కబ్జా చేశారు. మెగా కృష్ణారెడ్డితో కలిసి ర్యాడిసన్ కు ఇచ్చారు.

ఆరోగ్యం కోసం బేపార్క్ పెడితే విజయసాయిరెడ్డి అల్లుడికి కట్టబెట్టారు. దసపల్లా భూముల విషయంలో బెదిరింపులకు దిగారు. వాల్తేరు క్లబ్ విషయంలో కూడా జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి బెదిరింపులకు దిగారు. ప్రభుత్వ భూములను తనఖా పెడుతున్నారు. చంద్రబాబు గారు తీసుసుకువచ్చిన లులూ గ్రూప్ సంస్థను వెనక్కి వెళ్లేలా చేశారు. ఆ భూములను అమ్మేందుకు చూస్తున్నారు. వైఎస్ విజయను విశాఖ ప్రజలు ఓడించడంతో ఇప్పుడు విజయసాయిరెడ్డిని తీసుకువచ్చారు.

మూడు రాజధానుల పేరుతో 600 ఎకరాల భూములు కొల్లగొట్టారు. జగన్ రెడ్డి మోసాన్ని ప్రజలు గ్రహించాలి. ఉత్తరాంధ్రపై ఏమాత్రం ప్రేమ లేదు. పరిశ్రమలను కడప, నెల్లూరుకు తరలిస్తున్నారు. విశాఖలో విలువైన భూముల కోసం కుట్రపన్నారు. రామానాయుడు స్టూడియోను కబ్జా చేయాలని చూస్తున్నారు. ఇంకో బినామి జీవీతో కలిసి చర్చి భూములపై కన్నేశారు. మీ మాట వినని అడిషనల్ కమిషనర్ ను మార్చారు.

దోచుకోవడానికే జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి విశాఖ వచ్చారు. జగన్ రెడ్డి పాపం పండింది. త్వరలోనే జైలుకు వెళతారు. రామానాయుడు గారు పెద్ద మనసుతో విశాఖలో స్టూడియో పెడితే లాగేసుకుంటున్నారు. కొండపై గెస్ట్ హౌస్ పేరుతో విలాశవంతమైన భవనాలు కట్టుకుంటున్నారు. అది జగన్ రెడ్డి కోసమే.

ఇంకా మీకు సరిపోలేదా? విశాఖ బీచ్ పై జగన్ రెడ్డికి ఎందుకంత ప్రేమ? అరవిందో భూముల ధరలు పెంచడానికేనా? అవినీతి సంపాదన కోసం విశాఖను నాశనం చేస్తున్నారు. స్వార్థం కోసం ఈ విధంగా చేయడం న్యాయం కాదు. జగన్ రెడ్డికి ఇప్పటికే లక్షల కోట్లు ఉన్నాయి. విశాఖ సంపదను ఇప్పటికైనా దోచుకోవడం ఆపాలి. విశాఖ అభివృద్ధిని కాపాడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లబ్దిదారులు త్వరితగతిన ఇల్లు నిర్మించుకొని గృహప్రవేశాలు చేయాలి