Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేడు జగన్‌ను కలవనున్న నిర్మాణ కార్మిక సంఘాలు

నేడు జగన్‌ను కలవనున్న నిర్మాణ కార్మిక సంఘాలు
, సోమవారం, 5 జులై 2021 (06:21 IST)
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం తీసుకొచ్చిన చట్టాలు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా సక్రమంగా అమలు కావడం లేదని, కార్మిక సంక్షేమబోర్డు నిధులు నవరత్నాలకు దారి మళ్లించారని కార్మిక సంఘాల నేతలు పేర్కొన్నారు.

రాష్ట్రంలో 3.50లక్షల క్లెయిమ్స్‌ క్లియర్‌ చేయకపోవడం శోచనీయమని సమావేశంలో పలువురు వక్తలు పేర్కొన్నారు. కార్మికుల సమస్యలను తెలుసుకునేందుకు సలహామండలి ఛైర్మన్‌ వి.శ్రీనివాసుల నాయుడు ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడలోని పాలిక్లినిక్‌రోడ్డులోని ఓ ప్రైవేటు హోటల్‌లో ట్రేడ్‌ యూనియన్లతో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు.

కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 11 గంటలకు సిఎం జగన్‌మోహన్‌రెడ్డిని కార్మిక సంఘాల నేతలు కలవాలని సమావేశం నిర్ణయించింది. ఎపి బిల్డింగ్‌ అండ్‌ వర్కర్స్‌ కన్‌స్ట్రక్షన్‌ వర్క్స్‌ యూనియన్‌ (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లి నరసింహారావు మాట్లాడుతూ కార్మికుల సంక్షేమబోర్డు నుంచి కార్మికులకు ఎటువంటి సహాయం అందడం లేదన్నారు.

ఇసుక కొరతతో 30లక్షల మంది మంది కార్మికులు పనులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. కేంద్రం కార్మికుల సంక్షేమం కోసం సహాయం చేయమని రాష్ట్రాలకు సూచించినా మన రాష్ట్రంలో ఒక్కరికీ కూడా సహాయం అందలేదన్నారు. సంక్షేమబోర్డు నిథులు నవరత్నాలకు దారిమళ్లించారని ఆరోపించారు.

చాలామంది కార్మికులు ప్రమాదంలో గాయపడిని ఎవరికీ ఉచిత వైద్యం అందడం లేదన్నారు. సలహామండలి చైర్మన్‌ వి.శ్రీనివాసుల నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో సమస్యలను కేంద్ర కార్మికశాఖ మంత్రి సంతోష్‌సింగ్‌ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు పేర్కొన్నారు.

కార్మికుల పిల్లలకు స్కాలర్‌షిప్‌లు ఇవ్వాలని బోర్డు నిర్ణయం పక్క రాష్ట్రాల్లో అమలవుతున్నా, తెలుగు రాష్ట్రాల్లో అమలు కావడం లేదన్నారు. సోషల్‌ సెక్యూరిటీ కోడ్‌ ద్వారా గ్రామ కమిటీల్లో తీసుకునే నిర్ణయాలు బోర్డు తీసుకోవడం జరిగిందని, ఈ కోడ్‌ ద్వారా రాబోయే రోజుల్లో కార్మికులకు లబ్ధి చేకూరుతుందన్నారు.

ఎఐటియుసి నాయకులు పి,వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి బోర్డును నిర్వీర్యం చేయడంతో సంక్షేమ నిధులు దారిమళ్లాయన్నారు. సంక్షేమబోర్డును పునరుద్దరించాలని సిఎంను కోరతామన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తూగోలో 662 పాజిటివ్ కేసులు.. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని?