కౌలు రైతులను ఆదుకునేందుకు పవన్ సలహాలు ఇవ్వొచ్చు : సజ్జల

Webdunia
గురువారం, 15 డిశెంబరు 2022 (17:58 IST)
రాష్ట్రంలోని కౌలు రైతులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి జగన్ సారథ్యంలోని వైకాపా ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. జనసేన పార్టీ అధినేత కౌలు రైతులను ఆదుకునేలా కౌలు రైతు భరోసా యాత్ర చేస్తున్నారు. ఈ యాత్రలో భాగంగా తన సొంత నిధులను కౌలు రైతులకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నారు. ఈ యాత్రకు కౌలు రైతుల నుంచి మంచి స్పందన వస్తుంది. 
 
దీంతో ప్రభుత్వం తరపున సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. కౌలు రైతులకు సంబంధించిన ఏదైనా మెరుగైన విధానం ఉంటే పవన్ చెప్పాలని సూచించారు. రాష్ట్రంలోని కౌలు రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని, వారికి అవసరమైన సాయం అందిస్తున్నట్టు చెప్పారు. 
 
ఇకపోతే ఏపీలో ముందస్తు ఎన్నికలపై సజ్జల స్పందిస్తూ, సొంత పార్టీలో ఊపు లేకపోవడంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముందస్తు రాగం అందుకున్నారని విమర్శించారు. తన పార్టీలోని కార్యకర్తల్లో ఉత్సాహం రగిలించేందుకు ముందస్తు పాట పాడుతున్నారంటూ సెటైర్లు వేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Purush: భిన్నమైన క్యాప్షన్స్, పోస్టర్‌లతో డిఫరెంట్ మూవీ పురుష

Prerna Arora: ఆరెంజ్ స్పూర్తితో తెలుగు సినిమా చేశా - జటాధర బ్లాక్ మ్యాజిక్ కథ : నిర్మాత ప్రేరణ అరోరా

Aadi Saikumar: శంబాల ఏ ఒక్కరినీ నిరాశపర్చదు : ఆది సాయికుమార్

సింగర్ రామ్ మిరియాల పాడిన టైటిల్ సాంగ్ సంతాన ప్రాప్తిరస్తు

Mahesh Chandra: పిఠాపురంలో అలా మొదలైంది అంటోన్న దర్శకుడు మహేష్‌చంద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments