Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టైటిల్ మారిన పవన్ కళ్యాణ్ - హరీశ్ శంకర్ కొత్త చిత్రం

Advertiesment
usthad bhagat singh
, ఆదివారం, 11 డిశెంబరు 2022 (09:49 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - దర్శకుడు హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో ఓ కొత్త చిత్రం తెరకెక్కనుంది. మైత్రీ మూవీస్ నిర్మాణ సంస్థ నిర్మించే ఈ చిత్రానికి తొలుత "భవదీయుడు భగత్ సింగ్" అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇపుడు ఈ పేరును మార్చారు. 
 
"భవదీయుడు భగత్ సింగ్" కాస్త "ఉస్తాద్ భగత్‌ సింగ్"గా మార్చారు. ఈ మేరకు చిత్ర బృందం టైటిల్‌తో పాటు పోస్టరును విడుదల చేసింది. "మనల్ని ఎవర్డా ఆపేది" అనే ట్యాగ్‌లైన్ కూడా జతచేసింది. ఈ చిత్రం త్వలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది.
 
కాగా, ఈ మూవీకి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అయాంక్ బోస్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించనున్నారు. సీనియర్ దర్శకుడు దశరథ్ స్క్రిప్ట్ వర్క్‌పై పని చేస్తున్నారు. ఇది తమిళంలో స్టార్ హీరో విజయ్ నటించిన "తెరి"కి అనువాదంగా తెరకెక్కుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పోస్టర్‌ ద్వారా పవన్‌ కళ్యాణ్‌ ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ అప్‌డేట్‌ వచ్చేసింది