Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వగ్రామంలో లాన్స్ నాయక్ సాయితేజ అంత్యక్రియలు

Webdunia
ఆదివారం, 12 డిశెంబరు 2021 (10:37 IST)
ఇటీవల తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లాలో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి చెందిన వారిలో చిత్తూరు జిల్లా ఎగువ రేగడ ప్రాంతానికి చెందిన బి.సాయితేజ కూడా ఉన్నారు. ఈయన అంత్యక్రియలు ఆదివారం గ్రామంలోని వ్యవసాయక్షేత్రంలో జరుగనున్నాయి. 
 
ఈ హెలికాఫ్టర్ ప్రమాదంలో త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ దంపతులు, మరో 11 మంది మృత్యువాతపడ్డారు. హెలికాఫ్టర్ కెప్టెన్ వరుణ్ సింగ్ మాత్రం ప్రాణాలతో బయటపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 
 
అయితే, ఈ ప్రమాదంలో చనిపోయినవారి శరీరాలు బాగా కాలిపోవడంతో గుర్తుపట్టలేకపోయారు. మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు చేసి మృతుల కుటుంబాలకు భౌతికకాయాలను అప్పగించారు. ఈ క్రమంలో సాయితేజ భౌతిక కాయాన్ని గుర్తించారు. ఆ తర్వాత శనివారం ఢిల్లీ నుంచి బెంగుళూరులోని యలహంక ఎయిర్‌బేస్‌కు తరలించారు. అక్కడ సైనిక లాంఛనాల అనంతరం కమాండ్ ఆస్పత్రికి తరలించారు. 
 
ఆదివారం చిత్తూరు జిల్లా ఎగువరేగడ స్వగ్రామానికి తరలిస్తారు. ఆ తర్వాత ఉదయం 9 గంటలకు సాయితేజ కుటుంబానికి చెందిన వ్యవసాయ క్షేత్రంలో సాయితేజ అంత్యక్రియలు పూర్తిచేస్తారు. ఈ అంత్యక్రియల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ హరినారాయణ్ పర్యవేహిస్తున్నారు.

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments