Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైజాగ్ స్టీల్ ప్లాంట్ : హైకోర్టులో పిల్ దాఖలు చేసిన లక్ష్మీనారాయణ

Webdunia
మంగళవారం, 30 మార్చి 2021 (14:49 IST)
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను సవాల్ చేస్తూ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ బుధవారం విచారణకు రానుంది. 
 
ఆంధ్రుల హక్కు.. విశాఖ ఉక్కుగా భావించే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా కార్మిక, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. 
 
ఈ నేపథ్యంలో కార్మికుల ఉద్యమానికి లక్ష్మీనారాయణ మద్దతు తెలిపారు. అంతేగాక స్టీల్ ప్లాంట్ లాభాల బాటలో నడవడానికి ఏం చేస్తే బాగుంటుందో కూడా తెలియజేస్తూ కేంద్రానికి లేఖ పంపారు. ఇదేసమయంలో వివిధ పార్టీల నేతలతో చర్చలు జరుపుతూ... కార్మికుల ఉద్యమానికి మద్దతు కూడగడుతున్నారు. 
 
మరోవైపు, ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జనసేన పార్టీతో పాటు, తెలుగుదేశం, అధికార వైకాపా, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ వంటి పార్టీలు కూడా సంపూర్ణ మద్దతు తెలిపిన విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments