మామను వెన్నుపోటు పొడిచిన బాబు కోడెలను ఆ పని చేశాడు... రోజా సంచలన వ్యాఖ్యలు

Webdunia
మంగళవారం, 17 సెప్టెంబరు 2019 (18:51 IST)
పల్నాటి పులి కోడెల శివప్రసాద్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి వుంది. ఐతే కోడెల మృతికి ప్రభుత్వ వేధింపులేనంటూ తెదేపా నాయకులు ఆరోపిస్తున్నారు. లక్ష రూపాయల కోసం కోడెల ప్రాణాన్ని తీశారంటూ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఐతే తెదేపా ఆరోపణలపై వైసీపీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.
 
ఆనాడు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ఆయన మరణానికి కారకులైన చంద్రబాబు నాయుడే కోడెల మృతికి కారణమంటూ రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. కోడెల వల్ల ఇబ్బందిపడ్డవారు కేసులు పెట్టడంతో ఆయన చంద్రబాబు అపాయిట్మెంట్ కోరారనీ, బాబు కనీసం ఆయనకు తలుపులు తీయకుండా తీవ్రంగా అవమానించారంటూ ఆరోపించారు. ఇలా అవమానించడం వల్లే శివప్రసాదరావు ప్రాణాలు తీసుకున్నారని ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యలు చేశారు.
 
కోడెలపై ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టలేదనీ, బాధితుల ఫిర్యాదులతోనే ఆ కేసులు నమోదయ్యాయని చెప్పుకొచ్చారు. కేవలం కోడెల ప్రాణాలు తీసుకోవడానికి కారణం ఆయన నమ్మిన నాయకుడు మోసం చేశాడనే బాధేననీ, అందువల్లే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారంటూ వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మరో 100 జన్మలైనా.. రజనీకాంత్‌లాగే పుట్టాలనుకుంటున్నా... తలైవర్ భావోద్వేగం

Akhil Raj: అఖిల్ రాజ్ హీరోగా సతీష్ గోగాడ దర్శకత్వంలో అర్జునుడి గీతోపదేశం

Raashi Singh: త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి లైఫ్ ఈజ్ ఎ గేమ్.. లిరికల్ సాంగ్

Suresh Babu: ఎమోసనల్‌ డ్రామా పతంగ్‌ చిత్రం : సురేష్‌బాబు

Anita Chowdhury: అంబాసిడర్ కారులో పదిమంది కుక్కేవారు : అనితా చౌదరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

తర్వాతి కథనం
Show comments