మంచంపై కూర్చొన్నవారిపైకి దూసుకెళ్లిన వ్యాను...

Webdunia
బుధవారం, 2 మార్చి 2022 (14:38 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. జిల్లాలోని సీకే దిన్నె మండలంలో మద్దిముడుగులో ఈ ప్రమాదం జరిగింది. 
 
వేగంగా వెళుతున్న వ్యాను ఒకటి అదుపుతప్పి ఆరు బయట మంచంపై కూర్చొనివున్న నలుగురిపైకి దూసుకెళ్లింది. దీంతో నలుగురు మృతి చెందారు. కడప, బెంగుళూరు, జాతీయ రహదారి సమీపంలో ఉన్న గ్రామంలో కడప నుంచి రాయచోటికి వెళుతున్న జిప్సీ వ్యాన్ ఈ ప్రమాదానికి గురైంది. 
 
ఈ ప్రమాదంలో కొండయ్య, లక్ష్మీదేవి అనే ఇద్దరు సంఘటనలో మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ గాయపడిన ఇద్దరు యువతులైన అమ్ములు, దేవిని కడపలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. 
 
అయితే, వీరిద్దరు కూడా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో కొండయ్య, అమ్ములు భార్యాభర్తలు కాగా, లక్ష్మీదేవి, దేవి వారి ఇంటి పక్కనే ఉండే కుటుంబ సభ్యులని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raka Fans Title: అల్లు అర్జున్ .. రాకా చిత్ర యానిమేటెడ్ టైటిల్ కు స్పందన

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ .. పంజ 4Kలో థియేటర్లలోకి తిరిగి వస్తోంది

Peddi: రామ్ చరణ్ తో ఐటెంసాంగ్ లో అలరించిన శృతి హాసన్, జాన్వీ కపూర్

హాలీవుడ్ క‌ల‌ర్స్‌ రియలిస్టిక్‌, ఇండియ‌న్ క‌ల‌ర్‌ ఎమోష‌న‌ల్‌, క‌ల్చ‌ర‌ల్లీ రిచ్‌ : కిషోర్ బోయిడాపు

Sri Satya: బిగ్ బాస్'ఫేమ్ శ్రీ సత్య ఆవిష్కరించిన విహారి OTT గ్లోబల్ విజన్

తర్వాతి కథనం
Show comments