Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి రోజా భర్తకు ఏమైంది..? లొకేషన్లు ఎలా సెలక్ట్ చేసుకుంటారో తెలియదా?

Webdunia
బుధవారం, 4 మే 2022 (14:32 IST)
ఏపీ మంత్రి రోజా భర్త ఆర్కే సెల్వమణి కొత్త వివాదానికి తెరలేపారు. ఏపీ, తెలంగాణలో తమిళ చిత్రాల షూటింగ్‌లు జరుగుతున్నాయని అలా చేయవద్దని ఆయన ఉద్యమం లేవదీశారు. కొద్ది కాలంగా తమిళ భారీ చిత్రాల షూటింగ్‌లు ఎక్కువగా హైదరాబాద్, విశాఖల్లో జరుగుతున్నాయి. 
 
ఇది ఫెప్సీ పేరుతో ఓ సినీ కార్మిక సంఘాన్ని నడుపుతున్న ఆర్కే సెల్వమణికి నచ్చలేదు. తన సంఘంలోని సభ్యులకు పనులు ఉండటం లేదని సెల్వమణి వివాదం ప్రారంభించారు. తాము సినిమా షూటింగ్‌లు చేయడానికి.. పనికిరామా అంటూ ఆయన సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
 
నిజానికి దర్శకుడు అయిన సెల్వమణికి షూటింగ్ లొకేషన్లు ఎలా సెలక్ట్ చేసుకుంటారో తెలుసు. కథను బట్టి షూటింగ్ చేసుకుంటారు. కానీ లేనిపోని వివాదం రేపి.. తెలుగురాష్ట్రాల్లో షూటింగ్‌లు వద్దని రచ్చ చేస్తున్నారు.
 
అంతేగాకుండా తమిళ సినీ కార్మికులకు పనులు ఉండటం లేదని అగ్రహీరోలందరూ హైదరాబాద్ , విశాఖల్లో షూటింగ్‌లు చేస్తున్నారని ఆయన అంటున్నారు. 
 
ఈ అంశంపై రజనీకాంత్, విజయ్ స్పందించారని.. తమిళ సినిమాల షూటింగ్‌లు చెన్నైలోనే చేయడానికి అంగీకరించారని.. అజిత్ ఇంకా స్పందించాల్సి ఉందంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా మదరాసి టైటిల్ గ్లింప్స్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments