Webdunia - Bharat's app for daily news and videos

Install App

షర్మిలపై రోజా ఫైర్.. చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారారు..

సెల్వి
శనివారం, 5 ఏప్రియల్ 2025 (12:26 IST)
ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలపై మాజీ మంత్రి రోజా మండిపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబు చేతిలో షర్మిల కీలుబొమ్మగా మారారని మాజీ మంత్రి రోజా విమర్శించారు. వివేకా హత్య కేసులో నిర్దోషులను బలి చేయాలన్న ఆరాటం షర్మిలకు ఎందుకని రోజా ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు రూపొందించుకున్న కుట్రలో షర్మిల ఒక అస్త్రంగా మారారని విమర్శించారు. 
 
ఇందులో భాగంగానే నిర్దోషులపై బురద చల్లుతూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. సొంత అన్న జగన్‌ను ఇబ్బంది పెట్టడమే మీ అసలైన లక్ష్యమన్నారు. వివేకాను తామే చంపామని చెప్పుకున్న అసలు హంతకులను అప్రూవర్లుగా మార్చారని... వారికి బెయిల్ వచ్చేలా చేసి, నిరంతరం కాపాడుతూ, టీవీల్లో వారిని హీరోలుగా చూపిస్తున్నారని రోజా మండిపడ్డారు. 
 
గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే వివేకా హత్య జరిగిందని చెప్పారు. కేసును సీబీఐకి అప్పగించాలని, విచారణను పక్క రాష్ట్రానికి మార్చాలని చెప్పారని.. ఇప్పుడు అధికారంలో టీడీపీనే ఉన్నా తమపై పడి ఏడుస్తున్నారన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments