Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాంగ్రెస్ నేతకు గుండెపోటు.. సీపీఆర్ చేసి ప్రాణం పోసిన ఎమ్మెల్యే! (Video)

Advertiesment
cpr treatment

ఠాగూర్

, శుక్రవారం, 4 ఏప్రియల్ 2025 (17:37 IST)
తెలంగాణ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నేత ఒకరు గుండెపోటుకుగురై అపస్మారకస్థితిలోకి జారుకున్నారు. ఈ విషయాన్ని గమనించిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు సీపీఆర్ చేసి రక్షించారు. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పర్యటన సందర్భంగా పార్టీకి చెందిన స్థానిక నేతలంతా భద్రాచలానికి తరలివచ్చారు. 
 
ఆ సమయంలో కాంగ్రెస్ నేత ఒకరు గుండెపోటుకుగురై అపస్మారకస్థితిలోకి జారుకున్నారు. దీంతో అక్కడే ఉన్న ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తక్షణమే స్పందించి, సీపీఆర్ చేయడంతో అస్వస్థతకుగురైన కాంగ్రెస్ నేతకు ప్రాణాపాయం తప్పింది. ఆ తర్వాత ఆయనను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కాంగ్రెస్ నేతకు డాక్టర్ ఎమ్మెల్యే సీపీఆర్ చేస్తున్న వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కన్నతల్లిపై కేసు వేసిన కొడుకుగా - ఆస్తులు కాజేసిన మేనమామగా జగన్ మిగిలిపోతారు... షర్మిల