Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్, అల్లు అర్జున్‌పై పోస్టులు పెట్టిన వారిని అరెస్ట్ చేయండి.. రోజా డిమాండ్ (Video)

సెల్వి
శనివారం, 9 నవంబరు 2024 (21:26 IST)
RK Roja
మాజీ మంత్రి, వైసీపీ అధికార ప్రతినిధి ఆర్కే రోజా కూటమి సర్కారుపై ఫైర్ అయ్యారు. ఏపీలో పరిపాలన చూస్తుంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా, నియంత పాలనలో ఉన్నామా అనే సందేహం వస్తోందన్నారు. హిట్లర్, గడాఫీ ఇద్దరు కలిసి కూర్చుని పాలిస్తే ఎలా ఉంటుందో, అలా ఏపీలో పాలన సాగుతోందంటూ రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
 
ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులను నియంత్రించలేక ఏపీ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని మండిపడ్డారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోం మంత్రి వంగలపూడి అనిత ఇంట్లోని వారే మహిళలా.. వైసీపీ నేతల ఇళ్లల్లో మహిళలు లేరా అని రోజా ప్రశ్నించారు. 
 
"పవన్ కళ్యాణ్‌కు ఆడవాళ్ల మీద గౌరవం లేదు. జనసేన, టీడీపీ వాళ్లు పెట్టే పోస్టులు ఆపలేరు. హీరో ప్రభాస్ మీద మెగాఫ్యాన్స్, జనసైనికులు పెట్టిన ఘోరమైన పోస్టులను తప్పని ఎప్పుడైనా ఆపించారా? వారిపై కేసులు పెట్టించారా? అల్లు అర్జున్ మీద, ఆయన కుటుంబం మీద పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా దిగజారుడుతనంగా పోస్టులు పెట్టింది. దానిని ఆపారా..? అంటూ ప్రశ్నించారు. ఇంకా హీరో ప్రభాస్, అల్లు అర్జున్ మీద పోస్టులు పెట్టిన వారిపైనా చర్యలు తీసుకోండి" అంటూ మాజీ మంత్రి రోజా డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూశాంత్ ఆత్మహత్య కేసు : ప్రియురాలు రియా చక్రవర్తికి భారీ ఊరట

కౌస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురయ్యా : వరలక్ష్మి శరత్ కుమార్

బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచిన 'మహానటి'

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్.. సినిమా కెరీర్‌పై దృష్టిసారించిన మిల్కీబ్యూటీ!!

కాంట్రాక్ట్‌పై సంతకం చేయగానే.. నో డేటింగ్ అనే షరతు పెట్టారు : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

తర్వాతి కథనం
Show comments