Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నారా లోకేష్ గారూ, పవన్ గారూ, అనిత గారూ నన్ను క్షమించండి: దణ్ణం పెట్టి అభ్యర్థిస్తున్న శ్రీ రెడ్డి

Advertiesment
Sri Reddy

ఠాగూర్

, శుక్రవారం, 8 నవంబరు 2024 (19:20 IST)
గత ఐదేళ్ళ వైకాపా ప్రభుత్వంలో అధికార నేతల అండ చూసుకుని రెచ్చిపోయిన వైకాపా సోషల్ మీడియా క్యాడర్‌కు ఇపుడు పగటి  పూటే చుక్కలు కనిపిస్తున్నాయి. రాత్రిళ్లు నిద్రపట్టడం లేదు. గత ఐదేళ్ల కాలంలో తాము ట్వీట్లతో రెచ్చిపోతే, ఇపుడు పోలీసులు కేసులు పెట్టి తగిన రీతిలో ట్రీట్మెంట్ చేస్తున్నారు. దీంతో మమ్మల్ని వదిలేయండి మహాప్రభో అంటూ ప్రాధేయపడుతున్నారు. ఇలాంటి వారిలో నటి శ్రీరెడ్డి కూడా ఒకరు ఉన్నారు. 
 
గత ఐదేళ్లుగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్, నారా లోకేశ్, భువనేశ్వరి, మాజీ ఎంపీ రఘురామరాజు ఇలా అనేక మందిపై నోరు పారేసుకున్నారు. ఇపుడు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకావడంతో పాటు పనిచేయకుండా నిద్రాస్థలో ఉన్న పోలీసుల వైఖరిని డిప్యూటీ సీఎం హోదాలో ఎండగట్టారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగారు. పోలీసులకు పూర్తి స్థాయి అధికారాలు ఇవ్వడంతో అసభ్యకర పోస్టులు పెట్టిన ప్రతి ఒక్కరినీ అరెస్టు చేస్తున్నారు. 
 
దీంతో శ్రీరెడ్డి తనను వదిలివేయాలంటూ ప్రాధేయపడుతున్నారు. ఈ మేరకు ఆమె శుక్రవారం సాయంత్రం ట్విట్టర్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. వైకాపా నేతలు ఆదేశాల మేరకే తాము నడుచుకున్నామని, తమ కుటుంబం పరువు దృష్ట్యా తమను వదిలివేయాలంటూ ప్రాధేయపడుతున్నారు. పైగా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేశ్, భువనేశ్వరి, పవన్ కుటుంబ సభ్యులు ఇలా ప్రతి ఒక్కరికీ పేరుపేరునా క్షమాపణలు చెబుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 


 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గేమ్ ఛేంజర్ టీజర్ ముందుగా కియారా అద్వానీ లుక్ విడుదల