కొత్త జిల్లాల బాదుడు పేరుతో కొత్త బాదుడు

Webdunia
మంగళవారం, 5 ఏప్రియల్ 2022 (14:54 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 13 కొత్త జిల్లాలను ఏర్పాటుచేసింది. దీంతో ఏపీలో మొత్తం జిల్లాల సంఖ్య 26కు చేరింది. ఈ కొత్త జిల్లాల ఏర్పాటుతో భూముల రిజిస్ట్రేషన్ చార్జీలను ఆమాంతం పెంచేసింది. ఈ పెంపు 15 శాతం నుంచి 75 శాతం వరకు వుంది. అంటే సగటున 20 శాతం మేరకు భారం మోపింది. ముఖ్యంగా, కొత్త జిల్లా కేంద్రాలు, వాటికి ఆనుకునివుండే శివారు, గ్రామీణ ప్రాంతాల్లో ఈ పెంపుదల భారీగా ఉంది. ఈ రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచుతూ రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. 
 
అయితే, ఈ పెరుగుదల పాత జిల్లాల్లో కూడా పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ ఆగస్టు నుంచి పెంపుదల అమల్లోకి రానుంది. ఈ పెంపుదల కూడా ఒక్కో జిల్లాలో ఒక్కో విధంగా ఉండనుంది. జిల్లా కేంద్రాలు, పక్కనున్న శివారు ప్రాంతాలు, ఆనుకునివున్న గ్రామీణ ప్రాంతాల్లో సబ్‌రిజిస్ట్రార్లు ఎక్కడికక్కడ విలువలు ఎంత పెంచాలన్నదానిపై ప్రతిపాదనలు తయారు చేశారు. 
 
దానిపై జాయింట్ కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ ఆమోదం తెలిపింది. ఆయా ప్రాంతాల్లోని అభివృద్ధి, అక్కడ వాస్తవ మార్కెట్ విలువలు, తదితరాలను దృష్టిలో ఉంచుకుని ఈ రిజిస్ట్రేషన్ల చార్జీలను పెంచారు. దీంతో ఒక్కో జిల్లాలో ఒక్కో విధంగా ఈ పెంపుదల ఉండనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మంచి ప్రేమ కథతో వస్తున్న లవ్ డేస్ పెద్ద విజయం సాధించాలి : సముద్ర

వైభవంగా వంశీకృష్ణ ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస కళ్యాణం

Venkatesh: మళ్ళీ పెళ్లి చేసుకుందాం అంటున్న విక్టరీ వెంకటేష్

Savitri : సావిత్రి 90 వ జయంతి సభ - మహానటి చిత్ర దర్శక నిర్మాతలకు సత్కారం

Prabhas: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రాజా సాబ్ పాట... ఆట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments