Webdunia - Bharat's app for daily news and videos

Install App

రంగన్న మృతదేహానికి రీపోస్టుమార్టం - మిస్టరీ మరణాలుగా మిగిలిపోవు!!

ఠాగూర్
శనివారం, 8 మార్చి 2025 (13:34 IST)
వైకాపా నేత, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రత్యక్ష సాక్షుల్లో ఒకరైన వాచ్‌మెన్ రంగన్న అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెల్సిందే. ఆయన మృతదేహానికి పోలీసులు శనివారం రీపోస్టుమార్టం చేశారు. పులివెందుల భాకరాపురం శ్మశానవాటికలో ఈ రీపోస్టుమార్టం ప్రక్రియను పూర్తి చేశారు. తన భర్త మృతిపై అనుమానాలు ఉన్నాయని రంగయ్య భార్య ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. పైగా, ఆమె పోలీసులకు ఫిర్యాదు కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో సందేహాల నివృత్తి కోసం మరోమారు పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహంపై గాయాలు ఉన్నాయా? లేవా? అనే అంశాన్ని పోలీసులు పరిశీలించారు. 
 
ఇదిలావుంటే, వైఎస్ వివేకా హత్య కేసులో సాక్షుల వరుస మరణాలు చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఏపీ హోం మంత్రి అనిత స్పందించారు. సాక్షుల మరణాలపై కేబినెట్ మీటింగ్‌లో చర్చించామన్నారు. సమగ్ర దర్యాప్తునకు ఆదేశించామని చెప్పారు. వివేకా హత్య కేసులో ఎవరి మరణాలు అయినా మిస్టరీగా మాత్రం మిగిలిపోవన్నారు. తలకిందులుగా తపస్సు చేసినా, తపప్ు చేసిన వారికి  శిక్ష తప్పదని ఆమె హెచ్చరించారు. రంగన్న పోస్ట్ మార్టం రత్వాత అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Imanvi: ప్రభాస్ సినిమాలో పాకిస్థాన్ నటి ఇమాన్విని తొలగించండి

మరో సినిమాకు రెడీ అయిన నందమూరి కళ్యాణ్ రామ్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments