Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉచితంగా మటన్ ఇవ్వలేదనీ.. పాతిపెట్టిన మృతదేహాన్ని తీసుకొచ్చాడు.. ఎక్కడ?

Advertiesment
mutton shop

ఠాగూర్

, సోమవారం, 10 ఫిబ్రవరి 2025 (19:00 IST)
తమిళనాడు రాష్ట్రంలోని తేని జిల్లాలో ఓ విచిత్ర సంఘటన ఒకటి జరిగింది. తనకు ఓ కేజీ మటన్ ఉచితంగా ఇవ్వాలని ఓ వ్యాపారిని ఓ వ్యక్తి అడిగాడు. దీనికి ఆ వ్యాపారి నిరాకరించాడు. దీంతో ఆగ్రహించిన ఆ వ్యక్తి శ్మశానానికి వెళ్లి పాతిపెట్టిన ఓ మృతదేహాన్ని తవ్వి తీసుకుని మటన్ దుకాణం వద్దకు వచ్చాడు. మృతదేహాన్ని చూసిన స్థానికులు భయంతో పరుగులు తీశారు. 
 
తేని జిల్లాలోని పళనిశెట్టి ప్రాంతానికి చెందిన మణియరసన్ అనే వ్యక్తి ఈ మటన్ దుకాణాన్ని నడుపుతున్నాడు. అదే ప్రాంతానికి చెందిన కుమార్ అనే వ్యక్తి జులాయ్‌గా తిరుగుతూ ఉంటాడు. ఈ క్రమంలో మణియరసన్ వద్దకు వెళ్లి ఉచితంగా మటన్ ఇవ్వాలని అడగ్గా వ్యాపారి నిరాకరించాడు. తాను అడిగిన డబ్బులు, మటన్ ఇవ్వకుంటే మలవిసర్జన కలిపిన నీటిని దుకాణంలో పోస్తానని హెచ్చరించాడు. దీంతో భయపడిపోయిన వ్యాపారి... ఓ కేజీ పేగులు ఇచ్చాడు. మటన్, డబ్బులు అడిగితే పేగులు ఇస్తావా అంటూ వ్యాపారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. 
 
కొంతసేపటి తర్వాత శ్మశానంలో పాతిపెట్టిన మృతదేహాన్ని వెలికితీసి భుజాన వేసుకుని వీధుల్లో నడుచుకుంటూ మటన్ దుకాణం వద్దకు వచ్చాడు. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు భయంతో పరుగులు తీశారు. స్థానికుల సమాచారంతో ఆగమేఘాలపై అక్కడకు చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని తిరిగి శ్మశానంలో పాతిపెట్టారు. దీనిపై పళనిశెట్టి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఇది స్థానికంగా కలకలం సృష్టించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Attack on Chilkur Priest: తెలంగాణ సర్కారు వారిని కఠినంగా శిక్షించాలి.. పవన్ కల్యాణ్ (video)