Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీమకు వచ్చిన కడలి-వారిని స్మరించుకుంటూ జిల్లాలకు పేర్లు

Webdunia
సోమవారం, 4 ఏప్రియల్ 2022 (16:23 IST)
కొత్త జిల్లాల ఏర్పాటు కారణంగా సీమకు తీర ప్రాంతం వచ్చింది. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు తొమ్మిది కోస్తా జిల్లాలకే తీర ప్రాంతం పరిమితం కాగా కొత్త జిల్లాల ఏర్పాటుతో రాయలసీమకు కూడా ఆ అవకాశం దక్కింది. 
 
కానీ ఇప్పటి వరకు సముద్ర తీర ప్రాంతాన్ని కలిగివున్న గుంటూరు జిల్లా ప్రస్తుతం తీర ప్రాంతం లేని జిల్లాగా నిలుస్తోంది. 
 
ఇకపోతే.. రాయలసీమలోని నాలుగు జిల్లాలు ఎనిమిది అవుతున్నాయి. ఇందులో తిరుపతి జిల్లాకు ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో తీరప్రాంతం ఉన్న సూళ్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గాన్ని కలిపారు. 
 
సూళ్లూరుపేటతో పాటు సముద్రతీరంలో ఉన్న గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం కూడా తిరుపతి జిల్లాలో కలుస్తోంది.
 
మరోవైపు ఏపీలో కొత్త శకం ప్రారంభం కాబోతోందన్నారు ఏపీ సీఎం జగన్. పరిపాలనా వికేంద్రీకరణలో అడుగు ముందుకేశామని అభిప్రాయపడ్డారు. 
 
కొత్త జిల్లాల కలెక్టర్లు, అధికారులు, ఉద్యోగులకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. పాలనా వికేంద్రకరణ ఒక్కటే లక్ష్యంగా కాకుండా.. గిరిజనులకు ఉపయోగపడేలా, స్వాతంత్ర్య సమరయోధులు, వాగ్గేయకారులను స్మరించుకుంటూ జిల్లాలకు పేర్లు పెట్టినట్లు జగన్ తెలిపారు.
 
గతంలో ఉన్న జిల్లాల పేర్లను అలాగే ఉంచుతూ.. పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా విభజించామని జగన్ అన్నారు. పాలనా వికేంద్రీకరణతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా పాత్ర మీనాక్షికి మానస శర్మ ఒక సజీవ ఉదాహరణ: నటి రితికా సింగ్ వ్యాఖ్య

వీరాంజనేయులు విహారయాత్ర కెరియర్ కి టర్నింగ్ పాయింట్.: నరేష్

హరి హర వీరమల్లు షూటింగ్ కు సిద్ధమవుతున్న పవన్ కళ్యాణ్

త్రివిక్రమ్‌ను ఇప్పటికైనా ప్రశ్నించండి ప్లీజ్.. పూనమ్ కౌర్

సత్య దేవ్, డాలీ ధనంజయ నటించిన జీబ్రా చిత్రం క్యారెక్టర్ రివీలింగ్ మోషన్-పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

జీడి పప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

తర్వాతి కథనం
Show comments