Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఇక వీధి వీధికీ రేషన్‌ వాహనం

Webdunia
ఆదివారం, 21 మార్చి 2021 (10:30 IST)
రేషన్‌ వాహనం ఇక నుంచి వీధి వీధికీ తిరగాల్సిందే. ఇంటింటికీ రేషన్‌ ఇవ్వాల్సిందే. రేషన్‌ పంపిణీ పూర్తయ్యేవరకూ ప్రతిరోజూ వాహనం పనితీరును జీపీఎస్‌ ద్వారా పర్యవేక్షించాలని పౌర సరఫరాల శాఖ నిర్ణయించింది.

ప్రతి వాహనానికి జీపీఎ్‌సను ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే ఆ శాఖ ఎయిర్‌టెల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. నాలుగు వారాల్లో అన్ని వాహనాలకు జీపీఎస్‌ ఏర్పాటు చేసి, మే నుంచి పర్యవేక్షణ విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. జీపీఎ్‌సను వాహనాల డ్రైవర్లు ఆపేందుకు వీల్లేకుండా నేరుగా వాహనం బ్యాటరీకి అనుసంధానం చేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

దానిని అనుసరించి ప్రతిరోజూ వాహనం ఎప్పుడు ప్రారంభమైంది... ఏయే వీధులు తిరిగింది... ఎక్కడ ఎంతసేపు ఆగింది... సాయంత్రం తిరిగి సచివాలయానికి ఎప్పుడు వచ్చింది... ఇలా మొత్తం వివరాలను జీపీఎస్‌ విధానం రికార్డు చేస్తుంది.
 
ప్రతి వాహనానికి పంపిణీ చేయాల్సిన గ్రామాలు, ప్రాంతం ఇప్పటికే మ్యాపింగ్‌ చేసి ఉన్నాయి. దీంతో ఆ వాహనం ఏ వీధులు తిరగాలనే దానిపై ఇప్పటికే స్పష్టత ఉంది. నెలలో ఆ వీధికి వాహనం వెళ్లిందా? లేదా? అనే విషయం మ్యాప్‌ చూస్తే తెలిసిపోతుంది. అలాగే ఎక్కడైనా వాహనం ఇంజిన్‌ ఆపేసినా వెంటనే జీపీఎ్‌సలో రికార్డు అవుతుంది.

ఈ వ్యవస్థను పర్యవేక్షించేందుకు తహసీల్దారు, జాయింట్‌ కలెక్టర్‌, జిల్లా పౌరసరఫరాల అధికారి, పౌరసరఫరాల గోడౌన్‌ ఎండీ, రాష్ట్ర స్థాయిలో కమిషనర్‌ కార్యాలయ అధికారులకు లాగిన్‌ అయ్యే సదుపాయం ఉంటుంది. వీరిలో ఏ అధికారి అయినా ఎప్పుడైనా లాగిన్‌ అయి ఫలానా వాహనం ఎక్కడుందనే విషయాన్ని చూడొచ్చు.

దీని ఆధారంగా ఏవైనా వాహనాలు పంపిణీ ప్రారంభించకపోయినా, ఎక్కడైనా ఆపేసినా వెంటనే సంబంధిత డ్రైవర్లకు ఫోన్లు చేసి హెచ్చరించే అవకాశముంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments