Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటిముందు ఆడుకుంటున్న ఆరేళ్ల బాలికను ఎత్తుకుపోయి?

Webdunia
శుక్రవారం, 22 మార్చి 2019 (14:33 IST)
ఇంటిముందు ఆడుకుంటున్న ఆరేళ్ల బాలికను ఎత్తుకుపోయి అత్యాచారం చేసి చంపేశాడు ఓ దుర్మార్గుడు. ఈ దుర్ఘటన మేడ్చల్‌ జిల్లా అల్వాల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని తుర్కపల్లిలో గురువారం చోటుచేసుకుంది. చంద్రయ్య, కృష్ణవేణి దంపతులు కొన్ని సంవత్సరాల క్రితం మెదక్‌ జిల్లా నుంచి నగరానికి వలస వచ్చి తుర్కపల్లిలో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. 
 
గురువారం మధ్యాహ్నం ఇంటి ముందు ఆడుకుంటున్న పాప కనిపించకుండా పోయింది. తల్లిదండ్రులు ఎక్కడ వెతికినా కనిపించలేదు. చివరికి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసారు. రాత్రి 12 గంటల సమయంలో అటుగా వెళ్తున్న కొందరికి శవం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి అది పాపదేనని గుర్తించారు. 
 
పోస్ట్‌మార్టం చేయించారు. బాలికను అత్యాచారం చేసి గొంతు నులిమి చంపినట్లు పంచనామాలో తేలింది. బాధితురాలి ఇంటి ప్రక్కన ఉన్న బిహార్‌కు చెందిన ఆరుగురు యువకులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments