Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ మాట చెప్పేవరకూ రమణదీక్షితులను వదిలే ప్రసక్తే లేదు: లక్ష్మణ్‌

Webdunia
శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (20:39 IST)
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పదవీ విరమణ చేసిన అర్చకులను తిరిగి వైసిపి ప్రభుత్వం తీసుకున్న విషయం తెలిసిందే. అందులో ప్రధానంగా తిరుమల శ్రీవారి ప్రధాన అర్చకులు రమణదీక్షితులు కూడా ఉన్నారు. అయితే ఈయనే ప్రస్తుతం వార్తల్లో నిలుస్తున్నారు. 
 
రమణదీక్షితులతో పాటు మరికొంతమంది అర్చకులను తిరిగి విధుల్లోకి తీసుకుంటూ టిటిడి నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో రమణదీక్షితులు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సాక్షాత్తు విష్ణువు అవతారంలో ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంటూ కొనియాడారు.
 
ఇది కాస్త హిందూ ధార్మిక సంఘాలను ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ఒక వ్యక్తిని దేవుడితో ఎలా పోలుస్తారు.. ఖచ్చితంగా అందుకు భక్తులకు రమణదీక్షితులు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తిరుమల శ్రీవారిని ఈరోజు తెల్లవారుజామున బిజెపి ఓబిసి మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ దర్సించుకున్నారు.
 
దర్సనం తరువాత ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడిన లక్ష్మణ్ రమణదీక్షితులపై మండిపడ్డారు. బహిరంగ క్షమాపణ చెప్పేంత వరకు రమణదీక్షితులను వదిలిపెట్టేది లేదంటున్నారు లక్ష్మణ్. టిడిపి అధినేత చంద్రబాబునాయుడు నుంచి హిందూ ధార్మిక సంఘాల వరకు అందరూ ఈ విషయంపై చాలా సీరియస్‌గా ఉన్నారు. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments