Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు తల్లి మృతి : మూడు రోజుల బెయిల్

Webdunia
సోమవారం, 22 ఆగస్టు 2022 (21:32 IST)
వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి అనారోగ్యం కారణంగా చనిపోయారు. దీంతో అంత్యక్రియల కోసం అనంతబాబుకు రాజమండ్రి కోర్టు మూడు రోజుల బెయిల్ మంజూరు చేసింది. 
 
తన కారు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు ఏ1 నిందితుడిగా ఉంటూ రాజమండ్రి జైలులో విచారణ ఖైదీగా ఉన్నాడు. ఆయన బెయిల్ కోసం పెట్టుకున్న దరఖాస్తులన్నీ కోర్టు కొట్టివేసింది. ఈ క్రమంలో ఆయన తల్లి మృతి చెందడంతో అనంతబాబుకు సోమవారం మూడు రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 
 
ఆదివారం మృతి చెందిన తల్లి అంత్యక్రియలు హాజరయ్యేందుకు తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ అనంతబాబు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఆయనకు మూడు రోజుల పాటు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. 
 
ఒకవైపు, మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూనే మరోవైపు పలు షరతులు విధించింది. ఈ నెల 25వ తేదీ మధ్యాహ్నం 2 గంటల్లోగా తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలుకు వచ్చి స్వయంగా లొంగిపోవాలని ఆదేశించింది. అంతేకాకుండా మూడు రోజుల పాటు స్వగ్రామం ఎల్లవరం సరిహద్దులు దాటి బయటకు రావొద్దని తెలిపింది. 
 
కేవలం తల్లి అంత్యక్రియల సమయంలోనే అనంతబాబు ఇంటి నుంచి బయటకు రావాలని, ఆయన వెంట నిత్యం పోలీసులు ఉండాలని ఆదేశించారు. అలాగే, ఈ కేసు గురించి ఎక్కడా ప్రస్తావించరాదన్న షరతు విధిస్తూనే, రూ.25 వేల బాండు, ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నటుడు సోనూసూద్ కు సంకల్ప్ కిరణ్ పురస్కారం

ఉక్కు సత్యాగ్రహం ఇన్ స్పైరింగ్ గా ఉంది : సీబీఐ మాజీ వీవీ లక్ష్మి నారాయణ

నాకు మరిన్ని మంచి లవ్ స్టోరీస్ రాబోతున్నాయి : మిస్ యు హీరో సిద్ధార్థ్

Pushpa 2: The Rule నటుడు శ్రీతేజ్ పెళ్లి చేసుకుంటానని మోసం: యువతి ఫిర్యాదు

ఫెస్టివల్స్ అనంతరం థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న వేదిక మూవీ ఫియర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments