Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాలుడు ప్రైవేట్ భాగాలపై తడమడం లైంగిక నేరం కాదు.. బాంబే హైకోర్టు

lips
, సోమవారం, 16 మే 2022 (09:01 IST)
బాలుడు ప్రైవేట్ భాగాలను తడిమి, అతని పెదవులపై ముద్దులు పెట్టడం లైంగిక నేరం కాదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో నిందితుడిపై పోలీసులు పెట్టిన ఫోక్సో చట్టాన్ని రద్దు చేసిన హైకోర్టు... నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది. ముఖ్యంగా, ఈ కేసులో నిందితుడు ఒక యేడాదిగా జైల్లో ఉండటం గమనార్హం. 
 
ముంబైకు చెందిన ఓ వ్యక్తి బీరువాలోని డబ్బులు తరచూ మాయం అవుతుండటంతో తన 14 యేళ్ల కుమారుడిని అవమానించాడు. డబ్బులు ఏమవుతున్నాయని గద్దించగానే నిజం చెప్పాడు. ఆ డబ్బులు తానే తీసి ఆన్ గేమ్స్‌ కోసం రీచార్జ్ చేసుకున్నట్టు తెలిపారు. అయితే, ఇక్కడ మరో విషయాన్ని కూడా ఆ బాలుడు బయటపెట్టాడు. 
 
రీచార్జ్ కోసం షాపునకు వెళ్ళగా, ఆ షాపు యజమాని తనను దగ్గరకు తీసుకుని ముద్దులు పెట్టడం, ప్రైవేటు భాగాలు తడుముతున్నాడని చెప్పాడు. దీంతో బాలుడు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు ఆయనపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు అరెస్టు చేశారు. ఫలితంగా గత యేడాది కాలంగా జైల్లో మగ్గుతూ వచ్చాడు. 
 
ఈ క్రమంలో తనకు బెయిల్ మంజూరు చేయాలని ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన హైకోర్టు.. నిందితుడు బాలుడు పెదాలపై ముద్దులు పెట్టాడని, ప్రైవేట్ భాగాగాలు తాకాడని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారని, అయితే, సెక్షన్ 377లో పేర్కొన్న అసహజ లైంగిక నేరాల కిందకి ఇవి రావని స్పష్టం చేస్తూ నిందితుడికి బెయిల్ మంజూరు చేశారు. సాధారణంగా 377 సెక్షన్ కింద బెయిల్ లభించడం అత సులభతరమైన విషయం కాదు. పైగా, జీవిత జైలుశిక్ష పడే అవకాశం కూడా ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాపట్ల చావలి గ్రామంలో మహిళా వలంటీరు హత్య