Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీలో పదో తరగతి పరీక్షా విధానంలో మార్పులు

ap govt
, సోమవారం, 22 ఆగస్టు 2022 (20:37 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి యేటా నిర్వహించే పదో తరగతి పరీక్షా విధానంలో మార్పులు చేసింది. ప్రస్తుతం 11 పేపర్లతో నిర్వహించే ఈ పరీక్షను ఇకపై ఆరు పేపర్లతోనే నిర్వహించనున్నారు. అంటే టెన్త్ పబ్లిక్ పరీక్షా పేపర్ల సంఖ్యను ఆరుకి కుదించింది. ఈ కొత్త పరీక్షా విధానం వచ్చే యేడాది నుంచి అమల్లోకిరానుంది. 
 
జాతీయ స్థాయిలో అనేక ప్రవేశ పరీక్షలతో పాటు నీట్ పరీక్షలు సీబీఎస్ఈ సిలబస్ ఆధారంగా జరుగుతున్నాయి. ఆ స్థాయిలోనే రాష్ట్ర విద్యార్థులను తీర్చిదిద్దాలన్న ఏకైక లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం రాష్ట్ర సిలబస్ ఆధారంగా జరిగే పరీక్షా విధానాన్ని మార్చాలని జగన్ సర్కారు గతంలో నిర్ణయించిన విషయం తెల్సిందే. దీనిపై సుధీర్ఘ కసరత్తు చేసిన ప్రభుత్వం కొత్త పరీక్షా విధానానికి ఆమోదముద్రవేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రేపు ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్‌కు పిలుపు