Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంద డిగ్రీల వేడిలో చికెన్ ఉడికించి ఆరగిస్తే బర్డ్ ఫ్లూ సోకదా?

ఠాగూర్
సోమవారం, 3 మార్చి 2025 (08:25 IST)
తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ విజృంభిస్తుంది. దీంతో అనేక ప్రాంతాల్లో కోళ్లు వందల సంఖ్యలో చనిపోతున్నాయి. ఈ కారణంగా చికెన్ విక్రయాలు పడిపోయాయు. ధరలు గణనీయంగా తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో బర్డ్ ఫ్లూ నేపథ్యంలో ప్రజల్లో నెలకొన్న భయాన్ని, అపోహలను తొలగించేందుకు వివిధ ప్రాంతాల్లో చికెన్ మేళాలను నిర్వహిస్తున్నారు. వీటికి చికెన్ ప్రియుల నుంచి అనూహ్య స్పందన లభిస్తుంది. 
 
తాజాగా రాజమండ్రి అజాద్ చౌక్ సెంటరులో చికెన్ సేల్ అండ్ రిటైల్ వర్తక సంఘం ఆధ్వర్యంలో చికెన్ మేళా ఏర్పాటు చేశారు. దీనికి మాంసాహారుల నుంచి విశేష స్పందన వచ్చింది. చికెన్ వంటకాలను ఆరగించడానికి స్థానిక నాన్ వెజ్ ప్రియులు బారులు తీరారు. ఈ మేళాలో వివిధ రకాల చికెన్ వంటకాలను ఏర్పాటు చేశారు. 
 
వంద డిగ్రీల వేడితో చికెన్ ఉడికించి తినడం వల్ల బర్డ్ ఫ్లూ మనిషికి వచ్చే అవకాశం లేదని తెలియజేసేందుకే ఈ మేళా ఏర్పాటు చసినట్టు నిర్వాహకులు వెల్లడించారు. బర్డ్ ఫ్లూ భయంతో చికెన్, గుడ్డు అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపిందని, పౌల్ట్రీ రంగానికి అపారనష్టం వాటిల్లిందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ఈ మేళాకు ప్రజల నుంచి మంచి స్పందన లభించడం తమకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని వారు తెలిపారు. కాగా, బర్డ్ ఫ్లూ భయంతో గత కొన్ని నెలలుగా తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు చికెన్ వంటకాలను ఆరగించడం మానేయడంతో వీటి విక్రయాలతో పాటు ధరలు కూడా ఒక్కసారిగా పడిపోయాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్రాండ్ అంబాసిడర్‌గా మీనాక్షి చౌదరినా? ఫ్యాక్ట్ చెక్

ఆశిష్ గాంధీ, మానస రాధాకృష్ణన్ జంటగా కొత్త చిత్రం

ఒకరోజు ముందుగానే నవ్వులు పంచనున్న 'మ్యాడ్ స్క్వేర్' చిత్రం

చిరంజీవికి బ్రిటన్ పౌరసత్వం : వార్తల్లో నిజం లేదని స్పష్టీకరణ

హీరోయిన్లకు వయసు పెరిగితే ప్రేక్షకులు ఒప్పుకోవడం లేదు : జ్యోతిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?

తర్వాతి కథనం
Show comments