Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆర్ఆర్ఆర్‌పై హత్యాయత్నం కేసు : ఐపీఎస్ అధికారికి నోటీసులు (Video)

Advertiesment
sunil naik

ఠాగూర్

, ఆదివారం, 2 మార్చి 2025 (12:56 IST)
ఏపీ అసెంబ్లీ ఉపసభావతి రఘురామకృష్ణంరాజుపై హత్యాయత్నం కేసులో ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్‌కు ప్రకాశం జిల్లా పోలీసులు నోటీసులు జారీ చేశారు. అప్పట్లో ఏపీ సీఐడీ డీఐజీగా సునీల్ నాయక్ పనిచేశారు. దీంతో ఆయన వద్ద విచారించేందుకు వీలుగా రఘురామకృష్ణంరాజు కేసు దర్యాప్తు అధికారి, ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ రెండు రోజుల క్రితం నోటీసులు పంపించారు. 
 
రఘురామరాజును హైదరాబాద్ నగరంలో అరెస్టు చేసి గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తీసుకొచ్చినపుడు సునీల్ నాయక్ కూడా వచ్చినట్టు దర్యాప్తు అధికారులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనలో ఆయన పాత్రపైనా విచారించాలని నిర్ణయించిన అధికారులు ఫ్యాక్స్, వాట్సాప్ ద్వారా నోటీసులు పంపించారు. 
 
బీహార్ క్యాడర్‌‍కు చెందిన సునీల్ నాయక్... వైకాపా ప్రభుత్వం డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి తీసుకొచ్చి సీఐడీ డీఐజీగా పోస్టింగ్ ఇచ్చింది. ఏపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి రాగానే సునీల్ నాయక్ తిరిగి బీహార్ వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన ఆ రాష్ట్ర అగ్నిమాపకశాఖలో డీఐజీగా పని చేస్తున్నారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

షిప్టు కారులో వచ్చి - కెమెరాలకు స్ప్రేకొట్టి... ఎస్బీఐ ఏటీఎంలో చోరీ... (Video)