విశాఖపట్టణంలోని రుషికొండ బీచ్‌కు ఉండే అత్యంత ప్రతిష్టాత్మకమైన బ్లూఫ్లాగ్ గుర్తింపు పోయింది. ఈ బీచ్‌లో మొత్తం 600 మీటర్ల తీర ప్రాంతాన్ని బ్లూఫ్లాగ్ బీచ్‌గా ధృవీకరిస్తూ 2020లో డెన్మార్క్‌కు చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ (ఎఫ్ఈఈ) సంస్థ సర్టిఫికేట్ అదించింది.
అయితే, గత కొంతకాలంగా ఇక్కడి బీచ్‌లోకి కుక్కలు రావడం, సీసీటీవీ కెమెరాలు పనిచేయకపోవడం, చెత్తా, చెదారం వంటి పలు రకాలైన వ్యర్థపదార్థులు పేరుకునిపోవడం, మూత్రశాలలు, దుస్తులు మార్చుకునే గుదులు అధ్వాన్నంగా తయారు కావడం, నడక మార్గాలు దెబ్బతిన్న విషయాన్ని గుర్తించిన కొందరు ఫోటోలతో సహా ఎఫ్ఈఈ సంస్థకు గత నెల 13వ తేదీన ఫిర్యాదు చేశారు.
వీటిని చూసిన తర్వాత తీవ్రంగా పరిగణించిన ఆ సంస్థ రుషికొండ బీచ్‌కు బ్లూఫ్లాగ్ గుర్తింపును రద్దు చేసింది. దీంతో పర్యాటక శాఖ అధికారులు శనివారం తీరంలోని జెండాలను కిందికి దించేశారు. కాగా, యేడాది క్రితం వరకు బీచ్‌ను నిర్వహణ చూసుకున్న సంస్థ నిర్వహణ ఒప్పందం ముగియడంతో తప్పుకుంది.