తెలంగాణాలో విస్తారంగా.. ఆంధ్రప్రదేశ్‌లో ఓ మోస్తారుగా వర్షాలు

Webdunia
మంగళవారం, 15 జూన్ 2021 (08:08 IST)
తెలుగు రాష్ట్రాల్లో వర్షాకాలం ప్రారంభమైంది. నైరుతి రుతపవనాలు దేశ వ్యాప్తంగా ప్రవేశించడంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో విస్తారంగా వానలు కురుస్తున్నాయి. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. మంగళ, బుధవారాల్లోకూడా తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 
 
మరోవైపు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం రాత్రి తీరం దాటి ఝార్ఖండ్‌పైకి చేరుకుంది. ఇదిప్పుడు తెలంగాణ వైపునకు తిరిగి ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో తెలంగాణలో నేడు, రేపు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఉరుములు, మెరుపులతోపాటు ఓ మాదిరి వర్షాలు కురుస్తాయని, ఆ సమయంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
 
ఇదిలావుంటే, అల్పపీడనం, నైరుతి రుతుపవనాల వల్ల రానున్న 48 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాయవ్య బంగాళాఖాతం, దాని పక్కనే ఉన్న ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌ తీరాలపై అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. 
 
దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఎత్తులో నైరుతి దిశగా వంగి ఉంది. ఇది పడమర దిశగా ప్రయాణించొచ్చు. వీటి ప్రభావంతో రానున్న 48 గంటల్లో కోస్తాంధ్రలో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని, రాయలసీమలో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి వానలు పడతాయని అధికారులు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments