Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరోనా రోగులకు చార్జీల బాదుడు: కొరడా ఝుళిపించిన ఏపీ, తెలంగాణ

Advertiesment
Heavy hospital fees
, సోమవారం, 14 జూన్ 2021 (13:35 IST)
అసలే మహమ్మారి. ఒక్కరికి ఎటాక్ అయితే ఇంట్లో వారందరికీ సోకుతుంది. దీనితో ఇల్లంతా కరోనాతో అల్లాడిపోతుంది. ఈ స్థితిలో ఆసుపత్రులకు వెళ్తుంటే కొన్ని ఆసుపత్రులు జలగల్లా పట్టి రోగుల నుంచి ఫీజుల రూపంలో డబ్బును పీల్చేస్తున్నాయి. దీనితో వైద్య చికిత్సకోసం వచ్చినవారు ఆర్థికంగా చితికిపోతున్నారు. మరికొందరి విషయంలో పైకం సమర్పించుకున్నా ప్రాణాలు దక్కడంలేదు.
 
ఈ నేపధ్యంలో కొన్ని ఆసుపత్రుల నిర్వాకం గురించి వందలాది ఫిర్యాదులు వస్తున్నాయి. కోవిడ్ -19 రోగుల నుంచి "ప్రొసిజర్ చార్జీలు" పేరిట కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు రోగుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. దీనితో రోగులు ప్రభుత్వానికి మొరపెడుతున్నారు. ఈ క్రమంలో అదనపు వడ్డలను చేస్తూ గుల్ల చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు కొరడా ఝుళిపించాయి.
 
హైదరాబాద్‌లోని 22 ఆస్పత్రులలో కోవిడ్ -19 రోగులకు చికిత్స చేయడానికి పర్మిట్‌ను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. అంతేకాదు ఇరు తెలుగు రాష్ట్రాల్లో 100కి పైగా ఆసుపత్రులకు నోటీసులు జారీ చేశాయి. తెలంగాణలోని కిమ్స్ శాఖ, విరించి, సెంచరీ హాస్పిటల్స్‌, కుకట్‌పల్లిలోని మాక్స్ హెల్త్ ఉన్నాయి. మొత్తం 113 ఆస్పత్రులపై 174 ఫిర్యాదులు వచ్చాయని, 105 ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ జి. శ్రీనివాస రావు తెలిపారు.
 
ఆంధ్రప్రదేశ్‌లో 16 ఆస్పత్రులలో కోవిడ్ -19 రోగుల నుంచి అధికంగా ఫీజు వసూలు చేసినందుకు రూ. 2 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు జరిమానా విధించారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించినందుకు 46 ఆస్పత్రులపై కేసు నమోదు చేశారు. మరో 50 ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
 
ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎ కె సింఘాల్ మాట్లాడుతూ, ఆసుపత్రులు అధిక బిల్లింగ్, ఫేక్ ఛార్జీలు వసూలు చేస్తే బిల్లు మొత్తానికి 10 రెట్లు జరిమానా విధిస్తారని హెచ్చరించారు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ చట్టం ప్రకారం, నేరాన్ని పునరావృతం చేస్తే, ఆసుపత్రి అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయబడతాయన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో విలువ ఆధారితంగా పన్నులు.. విపక్షాల ఫైర్