Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో వర్షాలు.. ముఖ్యంగా ఈ జిల్లాలకు అలర్ట్

Webdunia
శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (13:59 IST)
శుక్రవారం ఉదయం నుంచి పలు జిల్లాల్లో వర్షాలు. శనివారం ఉత్తర కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు, దక్షిణ కోస్తాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ పడొచ్చు.
 
ఏపీపై ఉపరితల ఆవర్తనం ప్రభావం. శుక్ర, శనివారాల్లో జిల్లాల్లో వానలు. తెలంగాణలోనూ కురుస్తున్న వర్షాలు. ఆంధ్రప్రదేశ్‌ తీరం, దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ప్రభావంతో శుక్రవారం దక్షిణ కోస్తాలో ఒకటిరెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. 
 
శనివారం ఉత్తర కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు, దక్షిణ కోస్తాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ పడొచ్చని సూచించారు. శుక్రవారం ఉదయం నుంచి ఏపీలోని పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో పంటలు చేతికి అందివచ్చే సమయం కావడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. 
 
తేలికపాటి జల్లులు అయితే సమస్యలేదని.. భారీ వర్షాలు పడితే ఇబ్బందులు తప్పవంటున్నారు.
మరోవైపు తెలంగాణలో కూడా వానలు పడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత భారీ వర్షం కురిసింది.. రోడ్లు జలమయం అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల రెండు రోజుల పాటూ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నట్టుండి ఇలా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments