నిప్పుల కుంపటిగా మారిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. వెస్ట్ బెంగాల్ నుంచి తెలంగాణ వరకు ఏర్పడివున్న ద్రోణి ఏర్పడివుంది. ఈ కారణంగానే ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఆ సమయంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.
పగటి పూట మాత్రం గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. వెస్ట్ బెంగాల్ నుంచి ఛత్తీస్‌గఢ్ మీదుగా ఉత్తర తెలంగాణ వరకు ద్రోణి కొనసాగుతుందని పేర్కొంది ఈ కారణంగానే పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశఁ ఉందని, కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.