Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెదేపాలో తగిన గుర్తింపు లేదు .. అందుకే తప్పుకుంటున్నా : శోభా హైమావతి

Webdunia
శనివారం, 17 జులై 2021 (15:58 IST)
తెలుగు దేశం పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి పార్టీకి రాజీనామా చేశారు. విశాఖపట్నం జిల్లా ఎస్.కోట నియోజకవర్గం నుంచి గతంలో ఆమె ఎమ్మెల్యేగా గెలుపొందారు. 
 
అయితే, గత కొంతకాలంగా తనకు పార్టీలో తగిన గుర్తింపు లభించడం లేదనే ఆవేదనతో పార్టీని వీడుతున్నట్టు తెలిపారు. పైగా, ఈమె తెదేపా మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా కూడా ఆమె పని చేశారు.
 
మరోవైపు ఆమె వైసీపీలో చేరబోతున్నారనే ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారంపై ఆమె స్పందించలేదు. అలాగనీ ఖండించనూ లేదు. దీంతో ఆమె వైకాపా కండువా కప్పుకోవడం ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి.
 
ఇదిలావుంటే, గత ఎన్నికల తర్వాత ఏపీలో టీడీపీ నుంచి గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీకి మద్దతుదారులుగా వ్యవహరిస్తున్నారు. పలువురు నేతలు వైసీపీ కండువా కప్పుకున్నారు. తెలంగాణలో కూడా పార్టీకి ఇటీవలే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ అధికార తెరాసలో చేరిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments