Publish Date: Thu, 15 Jul 2021 (08:50 IST)
Updated Date: Thu, 15 Jul 2021 (08:51 IST)
తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన గురువారం జరగనుంది. గుంటూరు జిల్లా కేంద్రంలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మధ్యాహ్నం మూడు గంటలకు సమావేశం ప్రారంభంమవుతుంది. ఈ సమావేశంలో ఏపీ ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
ముఖ్యంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదం, వ్యవసాయ రంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యం, కుదేలవుతున్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, సహజ వనరుల దోపిడీ, జాబ్‌లెస్ క్యాలెండర్, విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణ, ఇష్టానుసారం పన్నులు, ధరల పెరుగుదల వంటి అంశాలపై పొలిట్ బ్యూరో చర్చిస్తుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.