పరిపాలనను, ప్రజల సంక్షేమాన్ని పక్కన పెట్టి ఆత్మలతో మాట్లాడే ముఖ్యమంత్రిని ప్రస్తుతం చూస్తున్నాం. అధికారంలోకి వచ్చేందుకు ఒక్క అవకాశం ఇవ్వాలని బతిమలాడుకున్న జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక ప్రజల సంక్షేమాన్ని గాలికి ఒదిలేశారు. ధరలతో ప్రజల నడ్డి విరుస్తున్నారు. ఆఖరుకు చెత్తపై కూడా ఈ చెత్త ప్రభుత్వం పన్నులు విధిస్తోంది. ముందు ముందు జుట్టు పన్నుకూడా వేస్తారు. ఇక అందరూ గుండు కొట్టించుకోవాల్సిందే అని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు.
బడిలో పాఠాలు చెప్పాల్సిన టీచర్లను మద్యం దుకాణాల వద్ద మందు బాబులను క్యూలో నిలబెట్టే పని చేయించుకున్నఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కిందన్నారు. జగన్‌రెడ్డి పాలనలో ప్రభుత్వ ఖజానా వెలవెలబోతుంటే, ఆయన సొంత ఖజానా గలగల మంటోందన్నారు.
భారతి సిమెంటు లాభాలు ఎలా పెరుగుతున్నాయో జగన్‌రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. అధికారంలోకి వస్తే వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తానని ఉద్యోగులను నమ్మించిన జగన్‌రెడ్డి ఇంతవరకు సీపీఎ్‌సను ఎందుకు రద్దు చేయలేని చంద్రబాబు ప్రశ్నించారు.