Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం వస్తున్నారు... మందులు షాపు, ఆస్పత్రి మూసివేయాల్సిందే...

Webdunia
మంగళవారం, 7 జనవరి 2020 (13:02 IST)
ఈ దారిలో ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు.. అందువల్ల ఈ రహదారిలో ఉండే మందుల షాపు, ఆస్పత్రి మూసివేయాల్సిందే. లేదంటే మేమే మూసివేస్తాం అంటూ షాపు యజమానులకు గట్టివార్నింగ్ ఇచ్చారు. దీంతో బెదిరిపోయిన యజమానులు షాపులు మాసివేశారు. 
 
మంగళవారం వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరుగనుంది. ఈ భేటీకి ముఖ్యమత్రి జగన్ హాజరవుతున్నారు. దీంతో ఆయన సచివాలయానికి రానున్నారు. వ్యవసాయం, అనుబంధ శాఖలకు రుణాల మంజూరుపై బ్యాంకు ఉన్నతాధికారులతో కీలక చర్చలు జరపనున్నారు. 
 
ఈ నేపథ్యంలో, పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మందడంలో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. రైతుల మహా ధర్నా కార్యక్రమానికి కూడా అనుమతి ఇవ్వలేదు. జాతీయ రహదారి దిగ్బంధనానికి బయల్దేరిన రైతులు, రైతు కూలీలను కూడా అడ్డుకున్నారు. 
 
అంతేకాదు మందడంలో మెడికల్ షాపులను కూడా బంద్ చేయించారు. సాధారణంగా ఎలాంటి బంద్‌కు అయినా మందుషాపులు, పాల సరఫరాకు ఎలాంటి అంతరాయం ఉండదు. కానీ, సీఎం జగన్ సచివాలయానికి వస్తుంటే మందుల షాపులతో పాటు... చివరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా మూసివేయించడం ఇది చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments