Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫీజు చెల్లించలేదని విద్యార్థులతో గోడకుర్చీ వేయించిన ప్రిన్సిపాల్ ... ఎక్కడ?

Webdunia
బుధవారం, 14 సెప్టెంబరు 2022 (14:32 IST)
స్కూలు ఫీజు చెల్లించనందుకు ఓ విద్యార్థుల పట్ల ప్రిన్సిపాల్ అత్యంత కఠినంగా నడుచుకున్నాడు. ఏకంగా 12 మంది విద్యార్థులతో గోడకుర్చీ వేయించాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లా కావలిలోని ఓ కార్పొరేట్ ప్రైవేటు స్కూలులో జరిగింది.
పట్టణంలోని పుల్లారెడ్డి నగరులో ఉన్న ఈ స్కూలులో 12 మంది విద్యార్థులు ఫీజు చెల్లించాల్సి ఉంది. 
 
అయితే, మంగళవారం వారిని ప్రత్యేకంగా ఒక గదిలోకి రప్పించి, 'మీరు ఫీజులు చెల్లించలేదు. మీ తల్లితండ్రులు ఫోన్లు చేసినా స్పందించడం లేదు. వేరే నెంబర్ల నుంచి మీరే ఫోన్ చేసి ఫీజులు కట్టాలని చెప్పండి. లేదంటే తరగతులకు హాజరు కానివ్వడం లేదని చెప్పండి' అంటూ విద్యార్థులతో ప్రిన్సిపాల్ లేఖా సురేశ్ ఫోన్లు చేయించారు. 
 
దీంతో తల్లిదండ్రులు హుటాహుటిన పాఠశాలకు చేరుకుని తమ పిల్లలను ఒక గదిలో దోషులుగా నిలబెట్టి ఉంచడం చూసి తట్టుకోలేకపోయారు. అక్కడున్న వారిని నిలదీయగా, ఈలోపు బ్రాంచ్ 3 ప్రిన్సిపాల్ శైలేశ్ అక్కడకు చేరుకుని తల్లిదండ్రులతో వాగ్వివాదానికి దిగారు. 
 
'ఫీజులు కట్టలేనప్పుడు మీ పిల్లలను కార్పొరేట్ స్కూల్లో చదివించడం ఎందుకు?' అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. వెంటనే మీడియా కూడా అక్కడకు చేరడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 
 
ఇలాంటి చర్యల వల్ల తమ పిల్లల మనోభావాలు దెబ్బతింటాయని, పది మందిలో తమకు అవమానం జరిగిందన్న మాన క వేదనకు గురైతే ఎవరు బాధ్యత వహిస్తారని తల్లిదండ్రులు మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments