Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నర్సరీ చిన్నారిపై స్కూలు బస్సు డ్రైవర్ అత్యాచారం.. ఎక్కడ?

Advertiesment
rape
మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్‌లో దారుణం జరిగింది. నర్సరి చిన్నారిపై స్కూలు బస్సు డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. పాపను బడి నుంచి ఇంటికి తీసుకెళుతూ ఆ వాహనంలోనే అతడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఇక్కడ ఘోరం ఏమిటంటే.. ఆ సమయంలో పిల్లల బాగోగులను చూసుకునే బాధ్యత ఉన్న మహిళా సంరక్షురాలు కూడా అదే బస్సులో ఉంది. ఆమె కూడా చిన్నారిపై అత్యాచారం చేసేందుకు డ్రైవర్‌కు తన వంతు సహకారం అందించింది. 
 
ఆ తర్వాత తన ప్రైవేటు భాగాల్లో నొప్పి ఉందంటూ పాప చెప్పడంతో తల్లి ఆందోళనకు గురైంది. ఏం జరిగిందని తల్లి ప్రశ్నించగా బస్సులో తనపై లైంగిక దాడి జరిగిందని, దీనికి మహిళా సంరక్షకురాలు కూడా సహకరిందని చెప్పింది. 
 
ఆ తర్వాత పాపతో కలిసి తల్లిదండ్రులు బడికి వెళ్లగా అక్కడే ఉన్న డ్రైవర్‌ను గుర్తించింది. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బస్సు డ్రైవర్, సంరక్షకురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొడాలి నాని కమ్మవర్గంలో పుట్టిన దరిద్రుడు : గోరంట్ల బుచ్చయ్య