Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బెళగావి జిల్లాలో యువకుడిపై వ్యక్తి అత్యాచారం

Advertiesment
బెళగావి జిల్లాలో యువకుడిపై వ్యక్తి అత్యాచారం
, ఆదివారం, 17 అక్టోబరు 2021 (13:29 IST)
కర్నాటక జిల్లాలో యువకుడిపై ఓ వ్యక్తి అత్యాచారానికి తెగబడ్డాడు. బైక్‌పై డ్రాప్ చేస్తానని బాధితుడిని నమ్మించిన నిందితుడు.. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి, అతనిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. 
 
బెళగావి జిల్లాకు చెందిన ఓ 24 ఏళ్ల యువకుడు హోటల్​లో క్లీనర్​గా పని చేస్తున్నాడు. రోజులానే అతడు అక్టోబరు 5వ తేదీన తన పని పూర్తయ్యాక ఇంటికి తిరిగి వెళ్లేందుకు బస్సు కోసం వేచి చూస్తున్నాడు. 
 
ఆ సమయంలో అథణి తాలుకాలోని సంకొనట్టి గ్రామానికి చెందిన రాజు అచారకట్టి అక్కడికి బైక్​పై వచ్చాడు. రాజు ఆ యువకుడిని 'తన బైక్​పై డ్రాప్​ చేస్తాను రమ్మని' పిలిచాడు. దాంతో రాజు మాటలను నమ్మిన బాధితుడు బైక్​పై ఎక్కాడు. 
 
అయితే బాధితుడిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లిన నిందితుడు అక్కడ అతనిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. దీనిపై అథణి పోలీస్​ స్టేషన్​లో బాధితుడు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడుని అరెస్టు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఖమ్మం జిల్లాలో బోల్తాపడిన ట్రాక్టర్ ... నలుగురు దుర్మరణం