Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవంబరు 1 న వైఎస్సార్ సాఫల్య అవార్డుల ప్రధానం

Webdunia
గురువారం, 21 అక్టోబరు 2021 (20:24 IST)
వైఎస్సార్ జీవిత సాఫల్య, వైఎస్సార్ సాఫల్య పురస్కారాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం (నవంబర్ 1) నాడు ప్రధానం చేయనున్నారు.

దివంగత మ‌హానేత వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వివిధ రంగాల్లో విశిష్ట ప్రతిభ కనపర్చిన వ్యక్తులు, సంస్థలకు 59 అవార్డులను ప్రకటించిందని, ఇందులో 29 వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారాలు, 30 వైఎస్సార్ సాఫల్య పురస్కారాలను ప్రకటించడం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి మరియు సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు.

కేటగిరీల వారీగా 8 సంస్థలకు, వ్యవసాయ అనుబంధ రంగాల్లో 11, కళలు, సంస్కృతి రంగాల్లో 20, సాహిత్యంలో 7, జర్నలిజంలో 6, మెడికల్ అండ్ హెల్త్ లో 7 మందిని అవార్డులకు ఎంపిక చేయటం జరిగిందన్నారు.

వైఎస్సార్ లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ అవార్డు క్రింద రూ.10 లక్షల నగదు, వైఎస్సార్ కాంస్య ప్రతిమ (జ్ఞాపిక), మెడల్, శాలువ, వైఎస్సార్ ఎచీవ్ మెంట్ అవార్డు క్రింద   రూ. 5 లక్షల నగదు, వైఎస్సార్ కాంస్య ప్రతిమ (జ్ఞాపిక), మెడల్, శాలువ బహుకరిస్తారని తెలిపారు. 

గతంలోనే ప్రధానం చేయాల్సిన అవార్డులు కోవిడ్ కారణంగా వాయిదా వేయడం జరిగిందన్నారు. వ్యవసాయం, కళలు, సంస్కృతి, సాహిత్యం మొదలైన కేటగిరీలకు అవార్డుల్లో ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు.

విశిష్ట సేవలు అందించిన కోవిడ్ వారియర్స్‌తో పాటు అసామాన్య ప్రతిభ కనపరచిన సామాన్యులను అవార్డుల హైపవర్ స్క్రీనింగ్ కమిటీ ఎంపిక చేసిందని తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

ప్రేక్షకుల మధ్య విజయ్ ఆంటోనీ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్

మిస్టర్ బచ్చన్ లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే పై సితార్ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments