కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా సీపీఐ సమర శంఖారావం పూరిస్తూ... రానున్న ఉద్యమాలకు సీపీఐ శ్రేణులు సన్నద్ధం కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ పిలుపు నిచ్చారు.
రాజమహేంద్రవరంలో సీపీఐ శాఖ కార్యదర్శుల వర్క్ షాప్ నల్లా రామారావు, తోకల ప్రసాద్, రవి అధ్యక్షతన
జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ,సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ మాట్లాడారు.
రైతు వ్యతిరేక చట్టాలపై ఏడాది కాలంగా ఉద్యమాలు చేస్తున్న రైతులపై కనికరం చూపించాల్సింది పోయి.. కేంద్రమంత్రి తనయుడు కారుతో తొక్కించి పలువురి రైతుల మరణానికి కారకులైనా ఆ మంత్రి కొనసాగడం అర్థ రహితం అన్నారు.
నిత్యావసర వస్తువులతో పాటు గ్యాస్, పెట్రోల్,డీజిల్,ఆకాశాన్నంటుతున్నా సామాన్యుడి గోడు ప్రభుత్వాలకు పట్టడం లేదన్నారు.
సి.ఎం. జగన్ అప్పులతో రాష్ట్రాన్ని దివాళా తీయించారని...ఉండవల్లి బయటపెట్టిన అప్పుల లెక్కలపై ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఉండవల్లి వాస్తవం చెప్పారని ప్రజలు బావిస్తున్నారని,
రాష్ట్ర అప్పులపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలిని డిమాండ్ చేశారు.
గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబును ఏపీ లోని అప్పుల భారంపై నిలదీసిన బుగ్గన రాజేంద్ర ప్రసాద్ ఢిల్లీలో వారంలో నాలుగు రోజులు గడుపుతూ అప్పులు తేవడం కోసం తాపత్రయ పడడాన్ని ఎలా పరిగణించాలి? అని అన్నారు. నవంబర్ నుంచి పోలవరం నిధుల కోసం సి.పి.ఐ పోరాట కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని అన్నారు.