Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొరుగు రాష్ట్రాలకు చెక్ .. నేటి నుంచి ప్రీమియం బ్రాండ్ల మద్యం అమ్మకాలు

Webdunia
శుక్రవారం, 31 డిశెంబరు 2021 (15:11 IST)
బాబూ ... మ్యాన్ష‌న్ హౌస్ బ్రాందీ ఉందా? అంటూ ప్రీమియం బ్రాండ్ల కోసం ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో మ‌ద్యం ప్రియులు వెంప‌ర్లాడుతున్నారు. ఇక్క‌డ ఆ ప్రీమియం మద్యం దొర‌క‌క‌పోవ‌డంతో, అధిక సొమ్ములు పెట్టి, తెలంగాణా, క‌ర్ణాట‌క మ‌ద్యాన్ని దొంగ‌చాటుగా కొంటున్నారు. దీని వ‌ల్ల పొరుగు రాష్ట్రాల నుంచి అక్ర‌మ మ‌ద్యం ర‌వాణా పెరిగిపోతోంది. దీనిని అరిక‌ట్టేందుకు న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా ఏపీ ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంది. 
 
 
ఏపీలో నేటి నుంచి ఏపీలో మద్యం పాలసీ సడలింపులు చేశారు. ఇటీవలే మ‌ద్యంపై పన్ను రేట్లు సవరించిన సర్కారు, ఆ ప్రీమియం బ్రాండ్ల అమ్మకాలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఇక నుంచి అందుబాటులోకి ప్రీమియం బ్రాండ్లు వ‌చ్చేశాయి. 
 
 
ఏపీలో ఇటీవల మద్యంపై పన్ను రేట్ల సవరణ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నేటి నుంచి ప్రీమియం బ్రాండ్ల మద్యం అమ్మకాలు చేపట్టనున్నారు. అందుకోసం ఎక్సైజ్ శాఖ అవసరమైన ఏర్పాట్లు చేసింది. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ కు చెందిన రిటైల్ అవుట్ లెట్లలో ప్రీమియం బ్రాండ్ల మద్యం విక్రయించనున్నారు. బార్లు, వాక్ ఇన్ స్టోర్లలోనూ ప్రీమియం బ్రాండ్లు అందుబాటులో ఉంచనున్నారు. ప్రీమియం బ్రాండ్ల విక్రయాలకు ఏపీ సర్కారు ఇటీవలే అనుమతి ఇచ్చింది. పొరుగు రాష్ట్రాల నుంచి ప్రముఖ బ్రాండ్లు రాష్ట్రంలోకి అక్రమంగా రవాణా అవుతుండడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Betting: అల్లాణి శ్రీధర్ దర్శకత్వంలో బెట్టింగ్ చిత్రం

Deverakonda: కంటెంట్ మూవీస్ చేస్తూ తెలుగు అభివృద్ధికి కృషి చేస్తా - విజయ్ దేవరకొండ

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments