Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్లక్ష్యం ఖరీదు.. నిండు గర్భిణి ప్రాణం, ఆసుపత్రి బయటే మృతి

Webdunia
సోమవారం, 3 మే 2021 (23:08 IST)
రంపచోడవరం, మారేడుమిల్లి: సకాలంలో వైద్యసేవలు అందక నిండు గర్భిణి ఆదివారం మృతి చెందారు. దాంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
 
వారి వివరాల ప్రకారం.. మారేడుమిల్లి మండలం పూజారిపాకలుకు చెందిన తొమ్మిది నెలల గర్భిణి పూజారి విజయకుమారి(26)కి ఆదివారం ఉదయం పురిటినొప్పులొచ్చాయి. దాంతో భర్త కృష్ణారెడ్డి మారేడుమిల్లి పీహెచ్‌సీకి తీసుకువెళ్లారు.
 
వైద్యులు అందుబాటులో ఉన్నప్పటికీ, నర్సు సేవలందించారు. పరిస్థితి విషమించడంతో ప్రాంతీయ ఆసుపత్రికి సిఫార్సు చేశారు. అంబులెన్సులో రంపచోడవరం ఆసుపత్రికి తీసుకొచ్చినప్పటికీ, ఓపీ రాయించుకు రావాలని వైద్యసిబ్బంది కాలయాపన చేయడంతో ఆసుపత్రి బయటే ఆమె సొమ్మసిల్లి పడిపోయి మృతి చెందిందని కుటుంబసభ్యులు చెబుతున్నారు. 
 
వైద్యసిబ్బంది నిర్లక్ష్యంతోనే ఆమె మృతి చెందిందని ఆశ వర్కర్ల యూనియన్‌ నేత మట్ల వాణిశ్రీ, సెంటర్‌ఫర్‌ రైట్స్‌ అధ్యక్షుడు బాలు అక్కిస ఆరోపించారు.

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments