Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్పత్రిలో గర్భిణికి కరోనా పాజిటివ్.. హోం క్వారంటైన్‌లో 20మంది సిబ్బంది

Webdunia
మంగళవారం, 9 జూన్ 2020 (11:03 IST)
నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో గర్భిణికి ఆపరేషన్ చేసిన 20మంది వైద్య సిబ్బందిని హోం క్వారంటైన్ చేశారు. మరోవైపు ఏపీలో కరోనా విలయతాండం చేస్తోంది. సోమవారం ఒక్కరోజే రాష్ట్రంలో 154 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 4,813కి చేరింది. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 2,387 మంది డిశ్చార్జ్ కాగా, 1,381 మంది ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
 
అలాగే చిత్తూరు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఒకే కుటుంబంలో ఆరుగురికి కరోనా పాజిటివ్ అని తేలింది. చిత్తూరు నగరంలోని చేన్నమ్మ గుడిపల్లెకు చెందిన ఓ కుటుంబంలో ఆరుగురికి కరోనా సోకింది. ఈ నెల 3న ఆ కుటుంబంలో ఒక వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నట్లు బయటపడింది. దీంతో కుటుంబంలోని 11 మందిని వికృతమాల క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. వారికి పరీక్షలు జరపగా అందులో ఆరుగురికి పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. 
 
మరోవైపు చిత్తూరు సబ్ జైలులో ఖైదీలు, సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహణకు చర్యలు చేపట్టారు. మొత్తం 150 మంది ఖైదీలు, సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇటీవల తమిళనాడుకు చెందిన ఓ ఖైదీకి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో జైలులోని ఖైదీలతో పాటు సిబ్బందికి కరోనా వైద్య పరీక్ష నిర్వహణకు చర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments