Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్వారంటైన్‌లో ఉంటున్నవారిపై జాగ్రత్తలు : మంత్రి మోపిదేవి

Webdunia
బుధవారం, 15 ఏప్రియల్ 2020 (09:03 IST)
గుంటూరు జిల్లాలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య పెరగడం దురదృష్టకరమని మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో 109 పాజిటీవ్ కేసులు నమోదయినట్లుగా చెప్పారు.

ఇలాంటి సమయంలో క్వారంటైన్‌లో ఉంటున్నవారిపై జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. అలాగే ప్రజలు కూడా సామాజిక దూరం పాటించాలని మంత్రి కోరారు. కరోనాపై ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటుదని చెప్పారు.

గుంటూరు జిల్లాలో మొత్తం 32 క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేశామని,  5,190 మందికి వైద్య సేవలు అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. 14 రోజులు క్వారంటైన్ పూర్తి అయిన తర్వాత ఇంటికి పంపించాలని ప్రభుత్వ అధికారులపై ఒత్తిడిలు వస్తున్నాయని మంత్రి మోపిదేవి అన్నారు.

అయితే 28 రోజులు క్వారంటైన్‌లో ఉంచాలని ప్రభుత్వం జీవో విడుదల చేసిందన్నారు. 14 రోజులు క్వారంటైన్‌లో ఉన్నవారికి నెగిటీవ్ రిపోర్టు వచ్చి.. బయటకు వెళ్లిన తర్వాత వారికి మళ్లీ పాజిటీవ్ వచ్చే అవకాశం ఉందని, జాతీయ స్థాయిలో అక్కడక్కడ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయన్నారు.

ఇలాంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని 28 రోజులు క్వారంటైన్‌లో ఉండాలని స్పష్టంగా చెబుతున్నామని, ప్రజలు అర్థం చేసుకుని సహకరించాలని మంత్రి మోపిదేవి కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా తాతగారు రసికుడు.. మెగాస్టార్ కామెంట్స్.. పవన్‌ పైన వైసిపి ట్రోల్స్

కన్నడ హీరో యష్‌తో కియారా అద్వానీకి కలిసి వస్తుందా?!!

సామాన్య వ్యక్తిలా మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యలు: జాతీయ మీడియాల్లో వక్ర చర్చలు

నా కథల ఎంపిక వెరైటీ గా ఉంటుంది : రానా దగ్గుబాటి

అమెజాన్ ప్రైమ్స్ లో సస్పెన్స్ థ్రిల్లర్ రాజు గారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

హైదరాబాద్ వేడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు డీహైడ్రేషన్ ప్రమాదంలో పడేస్తున్నాయి: హెచ్చరిస్తున్న నిపుణులు

బీట్ రూట్ జ్యూస్ ఉపయోగాలు

Malida Sweet: తెలంగాణ వంటకాల్లో చిరు ధాన్యాలు.. మిగిలిన చపాతీలతో మలిదలు చేస్తారు.. తెలుసా?

Garlic: వెల్లుల్లితో చుండ్రు సమస్యకు చెక్.. వెల్లుల్లిని నూనె తయారీ ఎలా?

తర్వాతి కథనం
Show comments