సుఖశాంతులు ప్రసాదించాలని శ్రీవారిని వేడుకున్నా.. గవర్నర్

Webdunia
శుక్రవారం, 4 అక్టోబరు 2019 (06:14 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వ‌భూషణ్ హరిచందన్ గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం శ్రీవారి దర్శనార్ధం తిరుమల చేరుకున్న ఆయన తొలుత పద్మావతి అతిధి గృహానికి విచ్చేశారు. అనంతరం గవర్నర్ హరిచందన్ మహాద్వారం ద్వారా ఆలయంలోకి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు.

స్వామివారి దర్శనం అనంతరం రాష్ట్ర గవర్నర్‌కు రంగ నాయక మండపంలో అర్చక స్వాములు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందచేసి ఆశీర్వచనం అందించారు. ఆలయ ఆవరణలో గవర్నర్ పాత్రికేయులతో మాట్లాడుతూ భారతదేశం గొప్ప  ప్రజాస్వామ్య దేశమని, భారతదేశంలోని ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని శ్రీవారిని కోరుకున్నానన్నారు.

శ్రీవారి దర్శనానంతరం గవర్నర్ పద్మావతి అతిధి గృహానికి చేరుకొని గురువారం సాయంత్రం తిరుమల నుండి రేణిగుంటకు బయలుదేరి వెళ్ళారు. కార్యక్రమంలో  తితిదే చైర్మన్ వై.వి.సుబ్బా రెడ్డి, ఈ.ఓ.అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈ.ఓ.ధర్మారెడ్డి, జిల్లా సంయుక్త కలెక్టర్ మార్కండేయులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Manoj Manchu: సెలెబ్రిటీతో పునర్జన్మ ఛాలెంజ్ ను స్వీకరించిన మనోజ్ మంచు

'దేశీ ప్రిన్సెస్‌'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్

Nani: 150 మిలియన్+ వ్యూస్ తో నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్

Devi Sri Prasad: ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: దేవిశ్రీ ప్రసాద్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

తర్వాతి కథనం
Show comments