Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుకు అది ఉంది.. నేను చూశా.. నేను విన్నా.. నేనున్నా..

Webdunia
సోమవారం, 27 మే 2019 (14:59 IST)
ఎన్నికల ఫలితాలు టిడిపికి ప్రతికూలంగా రావడం.. భారీ మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందిన విషయం తెలిసిందే. అనూహ్య రీతిలో 151 సీట్లను వైసిపి గెలుపొందడంతో ఒక్కసారిగా ఆ పార్టీ నేతలు సంబరాల్లో మునిగితేలుతున్నారు. జగనన్న పాలన వచ్చిందంటూ సంతోషంగా ఊగిపోతున్నారు. ఇదంతా బాగానే ఉన్నా చంద్రబాబును టార్గెట్ చేస్తూ వచ్చిన వైసిపిలోని కొంతమంది ముఖ్య నేతలు ఇప్పుడు అదే జోరుతో విమర్శలు చేస్తున్నారు.
 
ముఖ్యంగా పోసాని క్రిష్ణమురళి చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్‌ను వాడు, వీడు అంటూ సంబోధించే చంద్రబాబు ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. చంద్రబాబుకు నిజంగా నైతిక విలువలు ఉన్నాయి. నేను ఆయన మాట్లాడిన వాయిస్ విన్నాను. చూశాను. నమ్ముతున్నాను. అయితే ఒక్కటే.

వ్యవస్థలను తప్పుదారి పట్టించి జగన్ పైన కేసులు పెట్టించారు చంద్రబాబు. ఆ కేసులను వెనక్కి తీసుకోండి. అప్పుడే మిమ్మల్ని జనం నమ్ముతారు. కానీ జనం నమ్మేది ఇప్పుడు కాదు. మరో 20 యేళ్ళ తరువాతైనా మీపై నమ్మకం వచ్చేట్లు చూసుకోండి అంటూ పోసాని క్రిష్ణమురళి అన్నారు.
 
వై.ఎస్.ఆర్. బాటలోనే జగన్ నడుస్తారన్న నమ్మకం నాకుంది. రాష్ట్ర ప్రజలకు జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చితీరుతారు. ఆ నమ్మకం నాకుంది. జగన్ హ్యాట్సాప్. నాకు ఒక కోరిక ఉండేది. జగన్ సిఎం కావాలని. ఆయన సిఎం అయ్యాడు. అది చాలు నాకు అంటూ సంతోషం వ్యక్తం చేశారు పోసాని క్రిష్ణమురళి.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments