బాధపడకండి.. అంతా మన మంచికే.. బాబును ఓదార్చిన బాలకృష్ణ

శనివారం, 25 మే 2019 (13:21 IST)
ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఈ స్థాయిలో తెలుగుదేశం ఘోర ఓటమి సాధించడం ఇదే ప్రథమం. పార్టీ స్థాపించినప్పటి నుంచి తెలుగుదేశం మూడుసార్లు ఓడిపోయినా నాలుగోసారి ఓడిపోయిన విధానం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. టిడిపి నేతలు మాత్రం ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. 
 
నారా కుటుంబం నుంచి చంద్రబాబునాయుడు, బాలకృష్ణ, నారా లోకేష్‌, చిన్న అల్లుడు భరత్‌లు పోటీ చేశారు. అయితే అందులో చంద్రబాబు, బాలకృష్ణలు మాత్రమే గెలిచారు. మిగిలిన ఇద్దరు ఓడిపోయారు. దీంతో బాలకృష్ణ చంద్రబాబును కలిశారు. పార్టీ ఘోర ఓటమిపై చర్చించారు. అధైర్యపడకండి.. వేచి ఉందాం. మనం మనల్ని మళ్ళీ ప్రజలు ఆదరిస్తారంటూ చెప్పుకొచ్చారు బాలకృష్ణ. 
 
చంద్రబాబు లాంటి సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న బాలకృష్ణనే ఓదార్చడం రాజకీయంగా చర్చకు దారితీస్తోంది. ప్రతిపక్షంలో ఉండడమేకాకుండా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేద్దామని, ప్రజల పక్షాన నిలబడుతామని బాలకృష్ణ చెప్పారట. దీంతో చంద్రబాబు కూడా బాలకృష్ణ మాటలు వింటూ అలా కూర్చుండిపోయారట. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం జనసేన పోటీ చేసిన సీట్లు 136... డిపాజిట్లు కోల్పోయిన సీట్లు 120