Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజల ఉసురు తగిలి చంద్రబాబు కుళ్లి కుళ్లి చస్తారు : పోసాని శాపనార్థాలు

Webdunia
శుక్రవారం, 4 ఆగస్టు 2023 (17:39 IST)
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని లక్ష్యంగా చేసుకుని సినీ నటుడు పోసాని కృష్ణమురణి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. శాపనార్థాలు పెట్టారు. అమరావతి రైతులు, పేద ప్రజల ఉసురు తరిగి చంద్రబాబు జీవిత సరమాంకంలో కుళ్లి కుళ్లి చస్తారంటూ శపించారు. అమరావతిలోని ఆర్-5 జోన్‌లో పేదలకు ఒక సెంటు భూమిలో ఇళ్లు నిర్మించేందుకు సిద్ధపడగా, ఏపీ హైకోర్టు బ్రేకులు వేసింది. ఈ తీర్పును అన్ని రాజకీయపక్షాలు స్వాగతిస్తుండగా, వైకాపా నేతలు మాత్రం విపక్ష నేతలపై విమర్శరు గుప్పిస్తున్నారు. ఇపుడు వారి జాబితాలో పోసాని కూడా చేరారు. 
 
అమరావతి రైతులు, పేదల ఉసురు తగిలి చంద్రబాబు జీవిత చరమాంకంలో కుళ్లికుళ్లి చస్తారంటూ పోసాని శాపనార్థాలు పెట్టారు. చంద్రబాబు చేసినవి, చేస్తున్నవీ అన్నీ మోసాలేనని ఆరోపించారు. జగన్ పైన కుళ్లుతో రైతులను ఎగదోసి బూతులు తిట్టిస్తున్నాడని మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా జగన్ చేస్తున్న మంచి పనుల వల్ల తనకు అధికారం దక్కదనే అక్కసుతో, తన కొడుకుకు భవిష్యత్తు ఉండదనే భయంతోనే చంద్రబాబు ఈ పనులు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయవేత్తగా కానీ, ఓ మనిషిగా కానీ, ప్రజలకు సేవ చేసే విషయంలో కానీ జగన్ కాలిగోటికి కూడా చంద్రబాబు సరితూగడంటూ పోసాని కృష్ణమురళి తీవ్ర వ్యాఖ్యలు. 
 
చంద్రబాబు పరిపాలనలో 1400 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, బషీర్ బాగ్‌లో ఆందోళన చేస్తున్న రైతుల పైకి కాల్పులు జరిపించారని గుర్తు చేశారు. పప్పూ బెల్లాల మాదిరిగా ప్రజల సొమ్మును పంచిపెడుతున్నాడంటూ జగన్ పై ప్రతిపక్షాల ఆరోపణలపై పోసాని మండిపడ్డారు. గతంలో ప్రజల సొమ్మును రాజకీయ నాయకులు పందుల్లాగా మింగేవారని, తొలిసారిగా ప్రజల సొమ్మును ముఖ్యమంత్రి జగన్ ప్రజలకే పంచిపెడుతున్నారని చెప్పారు. ఆయన తినకుండా, మందిని తిననీయకుండా ప్రజలకే తినిపిస్తున్నాడని వివరించారు. రాష్ట్ర చరిత్రలో ఎవరైనా సరే జగన్ కంటే మెరుగైన పాలన అందించారని నిరూపిస్తే.. ప్రజలతో చెప్పు దెబ్బలకు సిద్ధమని పోసాని సవాల్ విసిరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharva: శర్వా, సంయుక్త పై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

Balayya: ఎనిమిది నెలలు నిద్రాహారాలు మాని కృషి చేసి సినిమాని రీస్టోర్ చేశారు : బాలకృష్ణ

Kadambari: వ‌దిలేసిన నిస్సాహ‌యుల‌ను మేం చేరదీస్తాం : మనం సైతం కాదంబరి

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments