Webdunia - Bharat's app for daily news and videos

Install App

హర్యానా అల్లర్లకు కారణమైన వారికి బుల్డోడర్ ట్రీట్మెంట్

Webdunia
శుక్రవారం, 4 ఆగస్టు 2023 (16:43 IST)
ఇటీవల హర్యానా రాష్ట్రంలో ఒక్కసారిగా అల్లర్లు, హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ అల్లర్లు నుహ్ జిల్లాలో చోటు చేసుకోగా, భారీ ఆస్తి నష్టం సంభవించింది. ఈ నేపథ్యంలో అల్లర్లకు కారణమైన వారిని గుర్తించిన ప్రభుత్వం వారిపై ఉక్కుపాదం మోపుతోంది. ఇందులోభాగంగా, వారి ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేసింది. అక్రమంగా నిర్మించిన నిందితుల గుడిసెలను ప్రభుత్వ అధికారులు కూల్చివేశారు. వీరికి రాళ్ళదాడులు, దుకాణాల లూటీల్లో సంబంధం ఉన్నట్టుగా అదికారులు గుర్తించారు. దీంతో వారిపై కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. 
 
నుహ్ జిల్లాని తపురలో అక్రమంగా నిర్మించిన 250 దాకా గుడిసెలను అధికారులు తొలగించారు. శుక్రవారం ఈ మేరకు భారీ ఎత్తున పోలీస్ దళాలను అక్కడ బందోబస్తు కోసం మొహరించి బుల్డోజర్లతో గుడిసెలను కూల్చివేశారు. పొరుగున ఉన్న బంగ్లాదేశ్ నుంచి గత నాలుగేళ్లలో చాలా మంది వలస వచ్చి, స్థలాలను ఆక్రమించుకుని, గుడిసెలు వేసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. వీరంతా కలిసి అల్లర్లలో పాల్గొన్నారు. రాళ్లదాడులు, దుకాణాల లూటీల్లో వీరి హస్తమున్నట్టు పేర్కొంటున్నారు. పైగా, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించిన అధికారులు వారి ఫోటోలను రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments