కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ రాహుల్ గాంధీకి గుజరాత్ కోర్టు విధించిన జైలు శిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీంతో ఆయనకు భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు పడిన రెండేళ్ళ శిక్షపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధఇంచింది. ఈ మేరకు సుప్రీంకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
కాగా, గత 2018లో జరిగిన కర్నాటక రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా, రాహుల్ గాంధీ మోడీ ఇంటి పేరుతో ఉన్నవారంతా దొంగలేనంటూ వ్యాఖ్యలు చేశారు. వీటిని గుజరాత్ మాజీ హోం మంత్రి పూర్ణేష్ మోడీ తప్పుబడుతూ గుజరాత్ కోర్టును ఆశ్రయించారు.
ఈ కేసును విచారించిన గుజరాత్ స్థానిక కోర్టు రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించి రెండేళ్ళ జైలుశిక్ష విధించింది. ఆ తర్వాత ఆయన ఈ శిక్షను రద్దు చేయాలని కోరుతూ కింది కోర్టు నుంచి అప్పీలు చేసుకుంటూ రాగా, ఆయనకు ఎక్కడా కూడా ఊరట లభించలేదు. తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించగా, అక్కడ కింది కోర్టు విధించిన శిక్షపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.